Honour Killing: పరువు హత్య కేసు… కూతురును, ఆమె ప్రియుడిని చంపిన తల్లిదండ్రులు.. మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

ప్రేమించినందుకు కూతురును, ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేశారు తల్లిదండ్రులు. పెళ్లి చేస్తామని నమ్మించి ఈ దారుణానికి తెగబడ్డారు. తర్వాత నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు అమ్మాయి తల్లిదండ్రులకు మరణ శిక్ష విధించింది.

Honour Killing: పరువు హత్య కేసు… కూతురును, ఆమె ప్రియుడిని చంపిన తల్లిదండ్రులు.. మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

Honour Killing: పరువు హత్య కేసులో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కూతురును, ఆమె ప్రియుడిని చంపినందుకు యువతి తల్లిదండ్రులకు, ఆమె బంధువులకు మరణ శిక్ష విధించింది. బదావ్‌ జిల్లా కోర్టుకు చెందిన జస్టిస్ పంకజ్ కుమార్ అగర్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

Ind vs Aus: ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం ఎవరూ రావొద్దు.. హెచ్‌సీఏ ప్రకటన.. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే జారీ

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2017 మేలో, ఈ హత్య జరిగింది. ఆశా అనే 19 ఏళ్ల అమ్మాయి, గోవింద్ కుమార్ అనే 23 ఏళ్ల అబ్బాయి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చలేదు. వీళ్లిద్దరూ ప్రేమించి, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని కుటుంబ సభ్యులు వారిని హత్య చేసేందుకు పథకం పన్నారు. వారి ప్రేమ పెళ్లికి అంగీకరించినట్లు నమ్మించారు. పెళ్లికి ముహూర్తం పెడతామని చెప్పి, మే 2017లో ఇద్దరినీ ఇంటికి పిలిపించారు. కూతురు, ఆమె ప్రియుడు ఇంటికి రాగానే వారిద్దరినీ తాడుతో కట్టేశారు. అనంతరం ఇద్దరినీ నరికి చంపేశారు. వెంటనే వాళ్లిద్దరూ ఘటనా స్థలంలోనే మరణించారు. అనంతరం వారి మృతదేహాల్ని ఇంటి దగ్గర ఉన్న పెరట్లో పాతిపెట్టారు.

Uttar Pradesh Shocker: పాస్‌పోర్ట్ ఫొటో కోసం స్టూడియోకు వెళ్లిన అమ్మాయి.. ఒంటరిగా ఉండటంతో ఫొటోగ్రాఫర్ అసభ్య ప్రవర్తన

ఈ హత్యలో అమ్మాయి తల్లిదండ్రులతోపాటు, మరో ఇద్దరు బంధువులు కూడా పాల్గొన్నారు. తర్వాత ఈ విషయం వెలుగు చూసింది. ఇంటి చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనపై ఆరాతీశారు. ఇద్దరి మృతదేహాల్ని పోలీసులు వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. ఇంతకాలం విచారణ జరిపిన కోర్టు తాజాగా నిందితులైన అమ్మాయి తల్లి జల్ధార, తండ్రి కిషన్ లాల్, బంధువులు విజయ్ పాల్, రామ్ వీర్‌ను నిందితులుగా పేర్కొంటూ నలుగురికీ మరణశిక్ష విధించింది. ఉద్దేశ పూర్వకంగా, ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితులు ఈ హత్య చేశారని కోర్టు నమ్మింది. అమ్మాయి తల్లి కూడా ఈ విషయంలో అమానుషంగానే ప్రవర్తించిందని కోర్టు పేర్కొంటూ తీర్పునిచ్చింది.