Sister Wedding Gifts : దారుణం.. చెల్లి పెళ్లికి గిఫ్ట్‌లు ఇస్తున్నాడని భర్తను చంపించిన భార్య

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతుడి భార్యను, ఆమె సోదరులను, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Sister Wedding Gifts : దారుణం.. చెల్లి పెళ్లికి గిఫ్ట్‌లు ఇస్తున్నాడని భర్తను చంపించిన భార్య

Sister Wedding Gifts : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యే భర్తను చంపించింది. తన సోదరులతో అతడిని హత్య చేయించింది. దీనికా కారణం ఏంటో తెలిసి అంతా షాక్ అవుతున్నారు. తన చెల్లి పెళ్లికి గిఫ్ట్ లు ఇవ్వాలని అతడు అనుకోవడమే అతడి పాలిట మృత్యువైంది. చెల్లి పెళ్లి నిశ్చయం కావడంతో ఆమెకు బహుమతిగా టీవీ, గోల్డ్ రింగ్ ఇవ్వాలని అతడు అనుకున్నాడు. అయితే, ఇది నచ్చని భార్య.. ఏకంగా తాళి కట్టిన భర్తనే చంపించింది.

బారాబంకీలో ఈ ఘోరం జరిగింది. మృతుడి పేరు చంద్రప్రకాశ్ మిశ్రా(35). అతడికి ఓ చెల్లి (పూజా) ఉంది. ఈ నెల 26న పూజాకి పెళ్లి నిశ్చయమైంది. దీంతో చంద్రప్రకాశ్ తన చెల్లి పెళ్లికి బహుమతిగా టీవీ, గోల్డ్ రింగ్ ఇవ్వాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని తన భార్యతో చెప్పాడు. అయితే, తన భర్త అతడి చెల్లికి గిఫ్ట్ లు ఇవ్వాలని అనుకోవడం మిశ్రా భార్యకి నచ్చలేదు. ఆమె బాగా అప్ సెట్ అయ్యింది. చెల్లి పెళ్లికి గిఫ్ట్ లు ఇవ్వొదని చెప్పింది. దీనిపై భర్తతో ఆమె గొడవ పడింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

పట్టరాని కోపంతో ఊగిపోయిన భార్య.. విషయాన్ని తన సోదరులకు చెప్పింది. వారిని ఇంటికి పిలిపిచింది. ఇంటికి వచ్చిన సోదరులు కర్రలతో చంద్రశేఖర్ ను తీవ్రంగా కొట్టారు. అలా గంటపాటు అతడిని హింసించారు. దీంతో చంద్రప్రకాశ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయంది. అప్పటికే చంద్రప్రకాశ్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతుడి భార్యను, ఆమె సోదరులను, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read : హాస్టల్‌లో ఘోరాతి ఘోరం.. వాటర్ సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. వీడియో వైరల్