Road Accident : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి మసునూరు టోల్ ప్లాజా వద్ద లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా..

Road Accident : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident

Updated On : April 24, 2024 / 7:33 AM IST

Road Accident Nellore : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి మసునూరు టోల్ ప్లాజా వద్ద లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొట్టింది. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. అయితే, వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై నుంచి తిరిగి కొయ్యలగూడెంకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన జ్యోతి కల్యాణి, రాజీ, కుమార్ గా గుర్తించారు.