Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో నిందుతులకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కొంతమంది నిందుతులకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులైన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ లకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. అలాగే మరికొంతమంది నిందుతులైన ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్ళై, సమీర్ మహేంద్రులకు కూడా బెయిల్ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు. కాగా ఈ కేసులో మొత్తం ఏడుగురి నిందితులపై సీబీఐ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. రూ.50వేలు వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 24కు వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక కోర్టు నిందితులకు బెయిల్ ఇచ్చింది.

కాగా..దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు రాజకీయ నాయకులు పేర్లు బయటపడ్డాయి. విజయ్ నాయర్ రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ అధికారులు కీలక అంశాలను వెల్లడించారు. ఢిల్లీలోని ప్రభుత్వ పెద్దలకు సుమారు రూ.100 కోట్లు అడ్వాన్స్ చెల్లింపులు చేసినట్లుగా తెలుస్తోంది.ఈ మద్యం పాలసీ తయారీలో కూడా విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ కోర్టుకు వెల్లడించింది.. అలాగే అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ ఇద్దరు కలిసే ఆర్థిక లావాదేవీలు నడిపినట్లు తెలిసింది. ఇప్పటివరకు రూ.30 కోట్ల వరకు ఢిల్లీ పెద్దలకు డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ పాలసీ తయారీలో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించారని రిపోర్ట్ లో తేలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు పెను సంచలనం కలిగించాయి. పలు రాష్ట్రాల్లో 169 చోట్ల ఈడీ సోదాలు ఈ స్కామ్ లో 34 మంది పాత్ర బయటపడిందని ఈడీ వెల్లడించింది.

 

 

ట్రెండింగ్ వార్తలు