Zomato 2022 : జొమాటోలో ఢిల్లీవాసి జోరు .. రోజుకు 9, ఏడాదికి 3,300 ఫుడ్ ఆర్డర్లు చేసిన ఒకే ఒక్కడు
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి జొమాటాలో జోరు చూపించాడు. 2022 సంవత్సరంలో రోజు తొమ్మిది ఆర్డర్లు ఇచ్చిన వ్యక్తిగా నిలిచాడు.ఏడాదికి 3,300 ఆర్డర్లు ఇచ్చాడని జొమాటో తెలిపింది.

Zomato 2022 orders
Zomato 2022 : 2022లో ‘స్విగ్గీ’ అతిపెద్ద ఆర్డర్ విలువ రూ.16 లక్షలు అని ప్రకటించింది. 2022లో వచ్చిన అతిపెద్ద ఆర్డర్ విలువ రూ.16.6 లక్షలు అని తెలిపింది.ఈ ఆర్డర్ ని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి చేశారని తెలిపింది. అలాగే ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జొమాటోలో కూడా అటువంటి ఒకే ఒక్కడున్నాడు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి జొమాటాలో రోజుకు 9 ఆర్డర్లు చేసి ఏడాదికి ఒక్కడే 3,300 ఆర్డర్లు చేసిన వ్యక్తిగా నిలిచాడు. జొమాటో 2022లో తన ఫుడ్ డెలివరీ యాప్ పై ఆర్డర్లకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తు ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి రోజుకు తొమ్మిది ఆర్డర్లు ఇచ్చాడని వెల్లడించింది.
అలాగే భారతీయలకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ అయిన బిర్యానీచే జొమాటాలో కూడా నిలిచింది. 2022లో భారత దేశ వ్యాప్తంగా స్విగ్గీకి నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్లు వస్తే జొమాటాలో కూడా బిర్యానీయే ఫేవరెట్ ఫుడ్ గా నిలిచింది. 2022లో జొమాటో యాప్ పై ప్రతి నిమిషానికి 186 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. అంటే స్విగ్గీలోకంటే జొమాటాలోనే ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ బిర్యానీయేనని మరోసారి రుజువైంది.
Swiggy : 2022లో ‘స్విగ్గీ’ అతిపెద్ద ఆర్డర్ విలువ రూ.16 లక్షలు
జొమాటోలో 2022లో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 3300 ఆర్డర్లు ఇచ్చి టాప్ కస్టమర్ గా నిలిచాడు. అంటే రోజుకు 9 ఆర్డర్లు ఇచ్చినట్టు లెక్క ఓవరాల్ గా చూసుకుంటే. ఇక డిస్కౌంట్ ప్రోమో కోడ్ లను ఉపయోగించుకునే విషయంలో పశ్చిమబెంగాల్ నిలిచింది. బెంగాల్ లోని రాయ్ గంజ్ మొదటి స్థానంలో నిలిచింది. బెంగాల్ లో 2022లో 99.7 శాతం కస్టమర్లు డిస్కౌంట్ ప్రోమో కోడ్ తోనే ఆర్డర్ చేశారు. జొమాటో యాప్ పై బిర్యానీ తర్వాత వాత ప్లేజ్ ను పిజ్జా చేజిక్కించుకుంది.పిజ్జా కోసం జొమాటాలో ప్రతి నిమిషానికి 139 పిజ్జా ఆర్డర్లు వచ్చాయని తెలిపింది సంస్థ.