Fire Broke In Delhi
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తరుచు నగరంలో పలు అగ్రిప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో నగరంలోని ఫ్యాబ్రిక్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓఖ్లా ప్రాంతంలోని ఫ్యాబ్రిక్ గిడ్డంగిలో జరిగిన ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్ని మంటల్ని అదుపులోకి తీసుకురావటానికి యత్నిస్తున్నాయి.శుక్రవారం (అక్టోబర్ 8,2021) తెల్లవారుజామున 3.45 గంటలకు దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లా ఫేజ్ -2 లో ఉన్న బట్టల గిడ్డంగిలో ఈ ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పడానికి 18 ఫైర్ టెండర్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నాయి. కానీ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.
Delhi | 17 fire engines are working at the spot, the fire has been brought under control; cooling process underway: SK Dua, Divisional Officer, Delhi Fire Service on fire at fabric godown in Harkesh Nagar, Okhla Phase 2 pic.twitter.com/0r3FOuf6cZ
— ANI (@ANI) October 8, 2021
కాగా గత మంగళవారం ఉదయం దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గ్రేటర్ కైలాష్ పార్ట్ -1 లోని మూడు అంతస్థుల అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలో మంటలు చెలరేగటంతో ఇద్దరు వృద్ధులతో సహా 10 మంది మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న నాలుగు ఫైర్ టెండర్లు మంటలను ఆర్పాయి. అగ్నిమాపక దళం రాకముందే..స్థానిక పోలీసులు వెనుక తలుపును పగలగొట్టి మంటలను అదుపు చేసి మంటల్లో చిక్కుకున్నవారిని సురక్షితంగా కాపాడారు.
అక్టోబర్ 5 సాయంత్రం అగ్ని ప్రమాదం గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందిందని దక్షిణ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బెనిటా మేరీ జాకర్ తెలిపారు. భవనంలో బేస్‌మెంట్ గ్రౌండ్ మరియు మూడవ అంతస్తు గురుబచన్ సింగ్ అనే వ్యక్తిది. మొదటి అంతస్తు అశోక్ బాత్రా, రెండవ అంతస్తు 72 ఏళ్ల ఆశా శ్రీవాస్తవ అనేవారు నివసిస్తున్నారు. ప్రమాద సమయంలో ఇంట్లో 10 మంది ఉన్నారు. సమాచారం అందుకున్న తరువాత, నాలుగు ఫైర్ టెండర్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే ప్రమాద ఘటనకు చేరుకున్న కానిస్టేబుళ్లు విక్రమ్,లాలారామ్ లు భవనం వెనుక తలుపును పగలగొట్టి మంటలను ఆర్పి మంటల్లో చిక్కుకున్నవారిని కాపాడారు. ప్రాణాలకు తెగించి ప్రమాదంలో చిక్కకున్నవారిని కాపాడిని కానిస్టేబుల్స్ ఇద్దరినీ సన్మానిస్తామని డిప్యూటీ పోలీసు కమిషనర్ తెలిపారు.