మెట్రో స్టేషన్లకు అమర జవాన్ల పేర్లు

  • Publish Date - March 9, 2019 / 11:58 AM IST

పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన వీర జవాన్లను గుర్తుంచుకొనే విధంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఢిల్లీ మెట్రో రెడ్ లైన్లో ఉన్న 2 స్టేషన్ల పేర్లు మార్చడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పుల్వామలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన ఇద్దరు అమరవీరుల జవాన్ల పేర్లు పెట్టాలని మార్చి 08వ తేదీ శుక్రవారం ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్‌ (డీఎమ్ఆర్‌సీ) వెల్లడించింది. 
Read Also : అమ్మ పోయాక మోడీనే నాన్నయ్యారు

ఘజియాబాద్‌కు సమీపంలోని ఎలివేటెడ్ కారిడార్‌ని పీఎం మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజేంద్ర నగర్ మెట్రో స్టేషన్ పేరును మేజర్ మోహిత్ శర్మ రాజేంద్ర నగర్ స్టేషన్‌గా, న్యూ బస్ అడ్డా స్టేషన్‌ పేరును షహీద్ స్థల్ (న్యూ బస్ అడ్డా)గా పేర్లు మార్చారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
Read Also : లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదు.. ఆయన డిపార్ట్ మెంటే కదా : బుగ్గన