Delhi Air Quality: ఢిల్లీలో డేంజర్.. అత్యంత దారుణ స్థాయికి పడిపోయిన గాలి నాణ్యత.. అమల్లోకి జీఆర్ఏపీ-4 నిబంధనలు

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. అధికారులు కాలుష్య నియంత్రణకు అన్నిరకాల చర్యలను తీవ్రతరం చేసినప్పటికీ ఢిల్లీలోని గాలి నాణ్యత సోమవారం మరింత దిగజారింది.

Delhi Air Quality

Delhi air quality: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. అధికారులు కాలుష్య నియంత్రణకు అన్నిరకాల చర్యలను తీవ్రతరం చేసినప్పటికీ ఢిల్లీలోని గాలి నాణ్యత సోమవారం మరింత దిగజారింది. అనేక ప్రాంతాలు తీవ్రమైన కేటగిరీలో ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 457గా ఉన్న గాలి నాణ్యత సూచీ.. సోమవారం ఉదయం 6గంటలకు సమయానికి గాలి నాణ్యత సూచిక 481కు చేరింది. దట్టంగా పొగమంచు అలముకోవడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. విమానాలకు ట్రావెల్ అడ్వైజరీ.. 9వ తరగతి వరకు పాఠశాలలన్నీ ఆన్ లైన్ లోనే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Gold Pocket Watch: వేలంలో రూ.16.9 కోట్లు పలికిన పాకెట్ గడియారం.. దీని ప్రత్యేక ఏమిటో తెలుసా?

కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)-4 నిబంధనలు సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇవాళ 9వ తరగతి వరకు విద్యార్థులందరికీ అన్ని పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని, 10 నుంచి 12 తరగతుల వారికి మాత్రమే పాఠశాలల్లో క్లాసులు నిర్వహించాలని ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆమె ట్విటర్ ద్వారా వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జీఆర్ఏపీ స్టేజ్ 4లో చర్యల్లో భాగంగా.. నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే, అవసరమైన సేవలను అందించే వాహనాలు మినహా ఢిల్లీ నగరంలోకి ట్రక్కులు, కాలుష్య వాహనాలు వంటి అనేక వాహనాలు రాకుండా ఆంక్షలు విధించారు. ఎల్ఎన్జీ, జీఎన్జీ, ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులు మాత్రమే ఢిల్లీలోకి ప్రవేశానికి అనుమతించనున్నారు. హైవేలు, రోడ్లు, ప్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్లు, పైపులైన్లు.. ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

Also Read: అమ్మో పులి.. రోడ్డు దాటుతూ కనిపించిన పులి, హడలిపోయిన వాహనదారులు..

మరోవైపు.. కాళింది కుంజ్ లోని యమునా నదిలో విషపూరిత నురుగు తేలుతూ కనిపించింది. నదిలో కాలుష్య స్థాయి ఇంకా ఎక్కువగానే ఉంది. రామశిశ్ పాశ్వాన్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. నేను 20ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నాను. దీని వల్ల (వాయు కాలుష్యం) కళ్లలో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, జలుబు బారిన పడుతున్నాం. ఇక్కడ కాలుష్యం చాలా ఎక్కువ. నీరు కూడా కలుషితం అవుతుంది. మేము అలవాటుపడ్డాం.. కానీ, కొత్తగా ఎవరైనా ఇక్కడ ఉండలేరు. వారు వెంటనే అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నాడు.