Wrestlers Protest: లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ సింగ్‭పై కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు

ఈ కేసు విషయంలో ఇప్పటి వరకు 180 మందికి పైగా ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. గోండాలోని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ నివాసానికి వెళ్లి అక్కడ ఆయన బంధువులు, సహచరులు, ఇంటి పనివాళ్ళు, అతని సహచరుల వాంగ్మూలాలను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు.

Wrestlers Protest: లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ సింగ్‭పై కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు

Updated On : June 15, 2023 / 1:43 PM IST

Brij Bhushan Sharan Sing: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‭పై రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో 1500 పేజీలతో చార్జ్ షీట్ దాఖలు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మహిళా రెజ్లర్ల ఫిర్యాదులపై డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ఈ చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ చార్జ్ షీట్‭ను స్వీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను జూన్ 22 మద్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.

Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు : రేవంత్ రెడ్డి

ఇక మరోవైపు.. విచారణలో భాగంగా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలకి సంబంధించి వివరాలు కోరుతూ ఐదు దేశాల రెజ్లింగ్ సమాఖ్యలకు ఢిల్లీ పోలీసులు లేఖలు రాశారు. రెజ్లింగ్ సమాఖ్యల సమాధానం అందిన తర్వాత ఈ కేసులో అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేయనున్న పోలీసులు వెల్లడించారు. టోర్నీల ఫోటోలు, వీడియోలు, రెజ్లర్లు తమ మ్యాచ్‌ల సమయంలో బస చేసిన ప్రదేశాల సీసీటీవీ ఫుటేజీలను ఢిల్లీ పోలీసులు కోరారు.

Wrestlers Protest: బ్రిజ్ భూషణ్‭ కేసులో బిగ్ ట్విస్ట్.. సెలెక్ట్ చేయలేదని కోపంతో పోక్సో కేసు పెట్టారట

ఈ కేసు విషయంలో ఇప్పటి వరకు 180 మందికి పైగా ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. గోండాలోని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ నివాసానికి వెళ్లి అక్కడ ఆయన బంధువులు, సహచరులు, ఇంటి పనివాళ్ళు, అతని సహచరుల వాంగ్మూలాలను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. సీన్ రికనస్ట్రక్షన్ చేయడానికి ఒక మహిళా రెజ్లర్‌ను ఢిల్లీలోని బ్రిజ్ భూషణ్ ఇంటికి తీసుకెళ్లి పోలీసులు విచారించారు.