Delhi Covid Updates : ఢిల్లీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 3 నెలల్లో ఇదే అత్యల్పం

దేశ రాజధాని ఢిల్లీని వణికించిన కొవిడ్-19 మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆక్సిజన్ కొరత, బెడ్స్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం కరోనాను ఎట్టకేలకు కట్టడి చేయగలిగింది.

Delhi Covid-19 Updates : దేశ రాజధాని ఢిల్లీని వణికించిన కొవిడ్-19 మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆక్సిజన్ కొరత, బెడ్స్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం కరోనాను ఎట్టకేలకు కట్టడి చేయగలిగింది. మొన్నటివరకు వేల సంఖ్యలో నమోదైన కరోనా కేసులు ఇప్పుడు మూడంకెల సంఖ్యకు చేరుకున్నాయి. రోజురోజుకీ కొత్త కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే ఢిల్లీ వాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

ఢిల్లీలో గత 24 గంటల్లో 213 కొత్త కోవిడ్ కేసులు, 28 మరణాలు నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. మూడు నెలల్లో కంటే అత్యంత తక్కువగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,30,884 నమోదు కాగా, కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 24,800కు చేరింది. ఢిల్లీలో కరోనా పాజిటివిటి రేటు కూడా 0.30శాతానికి పడిపోయింది. గత ఫిబ్రవరి 23న 0.25 శాతం ఉండగా.. ఆ తర్వాత తక్కువకు పడిపోయింది.

గత 24 గంటల్లో ఢిల్లీలో మొత్తంగా 497మంది కరోనా నుంచి కోలుకుగా.. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 3,610కి తగ్గిపోయింది. గత 24 గంటల్లో 71,513 కరోనా పరీక్షలను నిర్వహించగా.. కొత్తగా 213 కరోనా కేసులే నమోదయ్యాయి. మార్చి 1 వరకు ఒక రోజులో 175 కొత్త కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత కరోనా కొత్త కేసులు అతి తక్కువగా నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అందుకే ముందస్తు జాగ్రత్త చర్యగా కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు