gold paan : స్పెషల్ కిళ్లీ..ఆహా ఏమి రుచి..

దేశ రాజధాని ఢిల్లీలో కన్సాట్ ప్లేస్ (సీపీ) యముస్ పంచాయ్ తీనే పాన్ దుకాణం ఉంది. ఈ షాపులో అనేక రకాల కిళ్లీలు లభిస్తుంటాయి.

Delhi shop sells gold paan worth Rs 600 : భోజనం చేయగానే..కొంతమందికి నోట్లో కిళ్లీ (పాన్) వేసుకోవడం అలవాటు. తప్పకుండా నోట్లో పాన్ వేసుకోకపోతే..భోజనం చేసినట్లు ఉండదని అంటుంటారు. ఇందులో చాలా రకాలే ఉంటాయి. బయట పాన్ షాపుల్లో కూడా రకరకాలైన కిళ్లీలు అమ్ముతుంటారు. ప్రజలు ఆదరించే పాన్‌లో ఎన్నో ఫ్లేవర్లు ఉన్నాయి. కానీ..ఓ పాన్ షాపులో గోల్డ్ పాన్ (బంగారం కిళ్లీ) కస్టమర్లను ఆక్టట్టుకొంటోంది. ఈ పాన్ తినడానికి జనాలు క్యూ కడుతున్నారంట. అయితే..దీనికి కొంచెం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

బంగారం పాన్ కదా..తింటే..అరుగుతుందా ? అసలు భయం వద్దు నిర్భయంగా..తినొచ్చు అంటున్నారు పాన్ షాప్ యాజమాన్యం. దేశ రాజధాని ఢిల్లీలో కన్సాట్ ప్లేస్ (సీపీ) యముస్ పంచాయ్ తీనే పాన్ దుకాణం ఉంది. ఈ షాపులో అనేక రకాల కిళ్లీలు లభిస్తుంటాయి. వీరు వెరైటీగా గోల్డ్ పాన్ తయారు చేశారు. దీనికి ధర రూ. 600గా నిర్ణయించారు. కిళ్లీకి గోల్డ్ పేపర్ అతికించి ఇస్తారు. తినే బంగారమే. గోల్డ్ పాన్ తయారీకి సంబంధించి..ఓ వీడియోను ఇటీవలే ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్టు చేశారు. మరి పాన్ ను ఎలా తయారు చేశారు ? తదితర విషయాలు తెలుసుకోవడానికి వీడియో చూడండి.

Read More : PM Modi : కరోనా పంజా, సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

ట్రెండింగ్ వార్తలు