PM Modi : కరోనా పంజా, సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

PM Modi : కరోనా పంజా, సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

Modi to hold meeting

Covid-19 cases : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాపిస్తోంది. వేలాదిగా నమోదయ్యే కేసులు..ప్రస్తుతం లక్షలకు చేరుకుంటున్నాయి. గత సంవత్సరం పరిస్థితి పునరావృతం అవుతుందా ? అనే అందరిలో భయం నెలకొంది. మరలా లాక్ డౌన్ విధిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 2021, ఏప్రిల్ 08వ తేదీ గురువారం జరిగే ఈ సమావేశంలో..కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ తీసుకుంటున్న చర్యలపై మోడీ ఆరా తీయనున్నారు. ఇతర సంబంధిత అంశాలపై చర్చించనున్నట్లు పీఎంవో కార్యాలయం వెల్లడించింది.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న క్రమంలో…ఆదివారం ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని ప్రధాని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్, కోవిడ్ జాగ్రత్తలు, నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్..ఈ ఐదు సూత్రాల వ్యూహాన్ని అత్యంత నిబద్ధతతో, కట్టుదిట్టంగా అమలు చేయాలని మోడీ స్పష్టం చేశారు. ఇక కరోనా పరిస్థితులపై మోడీ సీఎంలతో సమావేశం అవుతుండడం ఈ సంవత్సరంలో ఇది మూడోసారి. గత సంవత్సరం వైరస్ విస్తరిస్తున్న క్రమంలో..పలు సార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ చర్చించారు. ఈ సంవత్సరం జనవరిలో టీకా పంపిణీ ప్రారంభానికి కంటే..ముందు సీఎంలతో సమావేశం జరిపారు. మార్చి 17వ తేదీన కూడా ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు.