Traffic Police : స్పీడ్ గా వెళితే..జేబుకు చిల్లే, గరిష్ట వేగం గంటకు 60 కి.మీ

దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల గరిష్ట వేగాన్ని నియంత్రించారు. వాహనాలు వేగంగా వెళ్లకుండా కొన్ని మార్గాల్లో పరిమితులు విధించింది. ఈ మేరకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నోటిఫికేషన్ విడుదల చేశారు.

Delhi Traffic Police Revise Speed Limit

Delhi Traffic Police : వాహనంతో రోడ్డు మీదకు వచ్చారా..రయి రయ్ మంటూ దూసుకెళుతున్నారా ? అయితే మీ జేబుకు చిల్లుపడినట్లే. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ మార్చేస్తున్నారు అధికారులు. ఎక్కువ స్పీడ్ గా వెళితే..భారీగా జరిమానాలు తప్పవని, రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందేనంటున్నారు ట్రాఫిక్ అధికారులు. దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల గరిష్ట వేగాన్ని నియంత్రించారు. వాహనాలు వేగంగా వెళ్లకుండా కొన్ని మార్గాల్లో పరిమితులు విధించింది. ఈ మేరకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నోటిఫికేషన్ విడుదల చేశారు.

డీఎన్డీ లో కార్లు గంటకు 70 కి.మీటర్లు, ద్విచక్ర వాహనాల స్పీడ్ 60 కి.మీటర్లు, బార్పులా ఫ్లై ఓవర్ లో కార్లు, ద్విచక్ర వాహనాలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని సూచించింది. ఢిల్లీ నుంచి నోయిడా టోల్‌ వరకు కార్లకు 70 కి.మీ, ద్విచక్ర వాహనాలకు 60 కి.మీ వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే..రింగ్‌ రోడ్‌ -ఆజాద్ పూర్ నుంచి చాంగ్డి రా చౌక్‌ వరకు కారు, బైకుల వేగం గరిష్ఠంగా 50 కి.మీ ఉండాలని వెల్లడించింది.

విమానాశ్రయం రోడ్డుపై వెళ్లే వారు..వేగం పరిమితిని 60 కిలోమీటర్లు (కార్లు, బైక్ లు)గా నిర్ణయించింది. ద్విచక్ర వాహనాలకు గంటకు 50-60, నివాస.. వాణిజ్య మార్కెట్ల లోపల అన్ని రోడ్లపై కార్లు, బైకులు గరిష్ఠ వేగ పరిమితి గంటకు 30 కిలోమీటర్లుగా నిర్ణయించింది. అతి వేగంగా వెళితే మాత్రం భారీ జరిమానాలు తప్పవని..డ్రైవర్లు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.

Read More : NIA-Kidari Murder Case : కిడారి, సోమ హత్య కేసులో ఎన్ఐఏ అనుబంధ చార్జ్‌షీట్