Robbing Monkeys : అడవుల్లో కోతుల్ని పట్టి తీసుకొచ్చి జనాలపైకి వదిలి దోపీడీలు

robbing people by using monkeys : దోపిడీలు చేయటంలో కేటుగాళ్లు ఆరితేరిపోయారు.దోపిడీలు చేయటంలో కొత్త రకం యోచన చేశారు ఇద్దరు యువకులు దాని కోసం పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. దాని కోసం కోతుల్ని ఉపయోగించారు. అడవుల్లో ఉండే కోతుల్ని పట్టుకుని జనావాసాల్లోకి తీసుకొచ్చి వాటిని జనాలపైకి వదిలి దోపిడీలకు పాల్పడుతున్నారు ఇద్దరు వ్యక్తులు. అలా కోతులు జనాలపైకి వెళ్లి బీభత్సం సృస్టిస్తుంటే ఆ హంగామాలో నగదు, విలువైన వస్తువుల లూటీ చేస్తున్న ఇద్దరు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఇద్దరికీ సహకరిస్తున్న మరో వ్యక్తిని పట్టుకోవటానికి యత్నించగా అతను పరారయ్యాడు. పట్టుబడిన నాథ్ అనే 26 ఏళ్ల యువకుడు, విక్రమ్ నాథ్ 23 యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ లో తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని బైటకు కక్కారు. గత మూడు నెలల క్రితం తుగ్లకాబాద్ అడవి నుంచి కోతులను పట్టుకుని తీసుకొచ్చామని ఆ కోతుల్ని జనాలమీదకు వది..ఆ గలాటాలో వారి దగ్గర నుంచి డబ్బు, నగరలు,విలువైన వస్తువులు దోచుకుంటున్నట్లుగా చెప్పారు. అడవుల్లో పట్టుకుని రెండు కోతులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఇద్దరు యువకుల నిర్వాకంతో మోసపోయిన వారి గురించి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

దక్షిణ ఢిల్లీ పోలీసులు మాలవీయ్ నగర్ ప్రాంతంలో కోతులను ఆడిస్తూ జనాలను భయపెడుతూ, లూటీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకుల్ని గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగి వారిని రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ప్రజల్ని భయాందోళనలకు గురిచేసి దోసుకుంటున్న ఇద్దరు వ్యక్తుల్ని చిరాగ్ ఢిల్లీ బస్టాండ్ వద్ద పట్టుకుని అరెస్టు చేశామని తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు