ఢిల్లీలో దుమ్ము తుఫాన్

దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం మారిపోయింది.గాలి కాలుష్యం మరోసారి ఢిల్లీ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.బుధవారం ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది.వాయువ్య భారతంలో దుమ్ము తుఫాన్ కారణంగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మరింత దారుణంగా ఉండే అవకాశముందని కేంద్రప్రభుత్వ ఆధ్వరంలోని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్(SAFAR)తెలిపింది.SAFAR ప్రకారం.. బుధవారం ఢిల్లీలో అత్యంత తక్కువ కేటగిరీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 341 దగ్గర ఉంది.గాలి అంతా ధుమ్మూ ధూళితో నిండిపోవడంతో పలువురు తీవ్ర అనారోగ్యానికి గురౌతున్నారు.ఇంటి నుంచి బయటకు రాకుండా పలువురు ఇళ్లల్లోనే ఉంటున్నారు.

0 నుంచి 50మధ్యలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) ఉంటే దానిని గుడ్ గా పరిగణిస్తారు.51నుంచి 100మధ్యలో ఉంటే సంతృప్తికరంగా,101 నుంచి 200 మధ్యలో ఉంటే ఓ మోస్తారుగా,201 నుంచి 300మధ్యలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటే దానిని వెరీ పూర్ గా పరిగణిస్తారు.401నుంచి 500మధ్యలో ఉంటే తీవ్రమైనదిగా పరిగణిస్తారు.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం ఢిల్లీలోAQI 339 దగ్గర రికార్డ్ అయింది.

గురువారం(మే-9,2019)రాత్రి నుంచి గుజరాత్,ఢిల్లీ,హర్యానా,రాజస్థాన్,ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్ విరుచుకుపడే అవకాశముందని SAFAR సైంటిస్ట్ ఒకరు తెలిపారు.శుక్రవారం వరకు పరిస్థితి దారుణంగానే ఉంటుందని ఆయన తెలిపారు.