కరోనా ఎఫెక్ట్ : 3 వేల మంది ఖైదీల విడుదల!..ఏ రాష్ట్రంలో

  • Publish Date - March 24, 2020 / 06:51 AM IST

కరోనాతో జనాలు వణికిపోతున్నారు. ప్రతి రంగంపై స్పష్టమైన ప్రభావితం చూపిస్తోంది. ఆర్థిక రంగం కుదేలవుతోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. భారతదేశాన్ని కూడా ఈ రాకాసి వణికిస్తోంది. వైరస్ ని అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా..606 జిల్లాలో లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటోంది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు 144 సెక్షన్ విధించి..ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచిస్తున్నాయి. 

అయితే..జైళ్లల్లో ఉన్న వారి పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించింది. తీహార్ జైళ్లో కరోనా వ్యాధి సోకుతుందనే భయం పట్టుకుంది. 3 వేల మంది ఖైదీలను రిలీజ్ చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం డిసైడ్ తీసుకుంది. మంధ్యతర బెయిల్ పై వీరిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే..కరోనాను కట్టడి చేసేందుకు…ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. షహీన్ బాగ్ లో కర్ఫ్యూ విధించారు. ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించివేశారు. ప్రస్తుత పరిస్థితును అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 

కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతినిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలను పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దేశంలో క్రమ క్రమంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 10 మంది చనిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు రిజిష్టర్ అవుతున్నాయి. తెలంగాణాలో 33, ఏపీలో 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఇరు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి. ప్రజలు బయటకు రాకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు. 

See Also | ప్రజల చేత ప్రమాణం చేయించిన పోలీసులు