Haryana Govt: అత్యాచారం, రెండు హత్యల కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న డేరా బాబాగా ప్రఖ్యాతిగాంచిన గుర్మీత్ రామ్ రహీమ్‌పై హర్యానాలోని మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం మరోసారి దయ చూపింది. రామ్ రహీమ్‌కు ప్రభుత్వం మరోసారి పెరోల్ ఇచ్చింది. ఈసారి ఆయనకు 30 రోజుల పెరోల్ వచ్చింది. అంతకుముందు జనవరి నెలలో కూడా ఆయనకు పెరోల్ లభించింది. ఆ సమయంలో 40 రోజుల పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు.
Manipur Violence: మణిపూర్ దారుణ వీడియో ఘటన.. ఎట్టకేలకు కీలక నిందితుడి అరెస్ట్
ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సిర్సా డేరాకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. రామ్ రహీమ్ ప్రస్తుతం రోహ్‌తక్‌లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన తన ఇద్దరు సోదరీమణులతో పాటు అత్యాచారం, రెండు హత్యలకు పాల్పడ్డ కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది.
Asaduddin Owaisi: మణిపూర్ ఘటనపై ఇన్నాళ్లు మౌనం.. ఇప్పుడు అందుకే మోదీ స్పందించారు: అసదుద్దీన్
అయితే రామ్ రహీమ్ పట్ల ప్రభుత్వం దయ చూపడం ఇదే తొలిసారి కాదు. నిజానికి ఇంతకు ముందు కూడా చాలాసార్లు పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. రామ్ రహీమ్ 30 నెలల్లో 7వ సారి పెరోల్ పొందాడు. హత్య, అత్యాచారానికి పాల్పడినట్లు తేలినప్పటికీ, రామ్ రహీమ్ కఠినమైన నేరస్థుడు కాదని ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం.
Godavari Water Level : ఉగ్ర గోదావరి.. ఏపీలో హైఅలర్ట్, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెరోల్‌పై మార్చి 2023లో పంజాబ్-హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌లో ఆయనను హార్డ్ కోర్ నేరస్తుడని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రిప్లై ఇస్తూ.. రామ్ రహీమ్ పెద్ద నేరస్తుడు కాదని పేర్కొంది. కాగా, దీనిపై హైకోర్టులో ప్రభుత్వం సమాధానమిస్తూ, రామ్ రహీమ్‌కు శిక్ష పడిన రెండు వేర్వేరు హత్య కేసులను సీరియల్ కిల్లింగ్ అని పిలవలేమని పేర్కొంది. గుర్మీత్ దుండగుడు కాదని, రెండు కేసుల్లోనూ అసలు హత్యలు చేయలేదని పేర్కొంది.