Asaduddin Owaisi: మణిపూర్‌ ఘటనపై ఇన్నాళ్లు మౌనం.. ఇప్పుడు అందుకే మోదీ స్పందించారు: అసదుద్దీన్

మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుంటే మోదీ దీనిపై స్పందించకుండా విదేశీ పర్యటనల్లో హాయిగా పాల్గొంటున్నారని కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించింది.

Asaduddin Owaisi: మణిపూర్‌ ఘటనపై ఇన్నాళ్లు మౌనం.. ఇప్పుడు అందుకే మోదీ స్పందించారు: అసదుద్దీన్

Asaduddin Owaisi

Updated On : July 20, 2023 / 4:12 PM IST

Asaduddin Owaisi – Manipur: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను కొందరు దారుణంగా హింసిస్తూ, నగ్నంగా ఊరేగించి, వీడియోలు తీసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మణిపూర్ లో హింసపై ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇప్పుడు ఆ వీడియో వైరల్ కాగానే స్పందించారని చెప్పారు.

” ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడం వల్లే ఆ ఘటనపై మోదీ బలవంతంగా స్పందించాల్సి వచ్చింది. మణిపూర్ లో మారణహోమం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రిని తొలగించి, ప్రధాని సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేస్తేనే న్యాయం జరుగుతుంది ” అని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుంటే మోదీ దీనిపై స్పందించకుండా విదేశీ పర్యటనల్లో హాయిగా పాల్గొంటున్నారని కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించింది.

కాగా, మణిపూర్‌ మహిళలపై కొందరు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటనపై మోదీ స్పందిస్తూ.. తాను చాలా బాధపడ్డానని, మణిపూర్‌ కుమార్తెలపై అఘాయిత్యానికి పాల్పడ్డవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని చెప్పారు. ఆ ఘటన దేశానికే సిగ్గుచేటని పేర్కొన్న విషయం తెలిసిందే.

Manipur Violence: పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ ప్రకంపనలు.. వాయిదా తీర్మానాలు ఇచ్చిన విపక్షాలు