బావా మరదళ్ల సరదాలు కుటుంబంలో భలే ఉంటాయి. మరదళ్లు బావలను ఆటపట్టించటం, కొంటె మాటలతో బావలు మరదళ్ళకు కౌంటరివ్వడం అదో సరదా..కానీ అటువంటి సరదాలు పోయి మనుషుల్లో వికృత చేష్టలు మొదలైతే తట్టుకోవటం కూడా కష్టమే. జార్ఖండ్ రాష్ట్రంలో ఒక కామపిశాచి మరదలికి మత్తుపదార్ధాలు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈవిషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించాడు
జార్ఖండ్ లోని, హజారీ ఘర్ జిల్లా, విష్ణు ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచల్జామ్ గ్రామంలో కొల్లేశ్వర్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అదే గ్రామంలో తల్లితండ్రులతో కలిసి నివసించే మరదలిపై మోజు పడ్డాడు. ఎలాగైనా అమెను అనుభవించాలనుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూడసాగాడు.
ఇటీవల ఆ యువతి కొల్లేశ్వర్ ఇంటికి వెళ్ళింది. ఆసమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఆమెను అనుభవించటానికి అదే సమయం అనుకున్నాడు. ఆమెను లోపలికి పిలిచి మర్యాదలు చేశాడు. మంచినీళ్లు ఇచ్చాడు. తినటానికి స్నాక్స్ ఇచ్చాడు.
అవి తిన్న యువతి మత్తులోకి జారుకుంది. వెంటనే ఆమెను బెడ్ రూంలోకి తీసుకు వెళ్లిన కొల్లేశ్వర్ మరదలి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన యువతి జరిగిన ఘోరం గుర్తించి కన్నీటి పర్యంతమయ్యింది.
ఈవిషయం గురించి ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించాడు. ఏడుస్తూ ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి తల్లితండ్రులు కంగారు పడ్డారు. విషయం తెలుసుకుని స్ధానిక పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు కొల్లేశ్వర్ తన మరదలికి ఇచ్చిన స్నాక్స్ లో డ్రగ్స్ కలిపినట్లు పోలీసులు కనుగొన్నారు.