జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ధనంజయ్ ఎన్నిక

JNUSU అధ్యక్ష పదవిని దాదాపు 30 సంవత్సరాల తర్వాత వామపక్ష మద్దతు ఉన్న విద్యార్థి సంఘం నుంచి దళితుడు దక్కించుకోవడం విశేషం.

జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ధనంజయ్ ఎన్నిక

JNUSU President Dhananjay

JNUSU President: ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (జెఎన్‌యుఎస్‌యు) ఎన్నికల్లో వామపక్ష మద్దతు ఉన్న అఖిల భారతీయ విద్యార్థి సంఘం (AISA) క్లీన్ స్వీప్ చేసింది. JNUSU అధ్యక్షుడిగా ధనంజయ్ ఎన్నికయ్యారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఉమేష్ సి అజ్మీరాపై ఆయన గెలుపొందారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత వామపక్ష మద్దతు ఉన్న విద్యార్థి సంఘం నుంచి దళితుడు అధ్యక్ష పదవిని దక్కించుకోవడం విశేషం.

ధనంజయ్ గురించి 5 ముఖ్య విషయాలు..
1. 1996-97లో ఎన్నికైన బట్టి లాల్ బైర్వా తర్వాత వామపక్షాల నుండి వచ్చిన మొదటి దళిత JNUSU అధ్యక్షుడు ధనంజయ్.

2. తాజా ఎన్నికల్లో ధనంజయ్ 2,598, ఉమేష్ సి అజ్మీరా 1,676 ఓట్లు దక్కించుకున్నారు.

3. ధనంజయ్ బీహార్‌లోని గయా జిల్లాకు చెందిన వారు.

4. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్ లో PhD విద్యార్థిగా ఉన్నారు.

5. JNUSU ప్రెసిడెన్షియల్ డిబేట్ సందర్భంగా పెరిగిన ఫీజుల గురించి ధనంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంపస్‌లో నీరు, విద్యార్థుల ఆరోగ్యం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని హామీయిచ్చారు. దేశద్రోహ ఆరోపణల కింద అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.