టార్గెట్ చైనా: ‘మేడ్ ఇన్ ఇండియా’ యాంటీ టాంక్ మిస్సెల్ నాగ్‌ను పరీక్షీంచిన భారత్

ఇండియా-చైనా బోర్డర్ టెన్షన్లు జరుగుతున్న వేళ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ నాగ్ మిస్సైల్ టెస్టు ఫైర్ చేశారు. ధ్రువస్త్ర అనే పేరుతో దీనిని సిద్ధం చేశారు. జులై 15-16నే టాప్ అటాక్ మోడ్ లో ట్రయల్స్ నిర్వహించాలని అనుకున్నారు. ఇంటెరిం టెస్టు రేంజ్, బాలాసోర్, ఒడిశాలో హెలికాప్టర్ లేకుండానే ట్రయల్స్ చేశారు.

డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన హెలీనా ప్ర‌పంచంలోనే అత్యంత అధునాతన యాంటీ ట్యాంక్ ఆయుధాలలో ఒకటి. ఇందులో అమ‌ర్చిన యాంటీ ట్యాంక్ గైడెడె వ్య‌వ‌స్థ ద్వారా ఎటువంటి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో అయినా ఇది ప‌నిచేయ‌గ‌ల‌దు. లాక్-ఆన్ బిఫోర్-లాంచ్ మోడ్‌లో పనిచేసే ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్ (ఐఐఆర్‌) ద్వారా దీనికి మార్గ‌ద‌ర్శ‌కాలు అందుతాయి.

ఇందులో అమ‌ర్చిన అత్యాధునిక టెక్నాల‌జీ ద్వారా యుద్ధ ట్యాంకుల‌ను విచ్చిన్నం చేయ‌గ‌లదు. దేశ ర‌క్ష‌ణ సామ‌ర్థ్యాల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి హెలీనా స‌హాయ‌ప‌డుతుందని సైనిక అధికారులు పేర్కొన్నారు. భార‌త వైమానిక ద‌ళంలో మ‌రో కీలక ఆయుధంగా హెలీనా (ధ్రువ‌స్త్రా)ని అభివ‌ర్ణిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు