గాంధీ విగ్రహాన్ని కోతులు ధ్వంసం చేశాయా ?

జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కోతులు ధ్వంసం చేశాయా ? లేక ఎవరైనా చేశారా ? అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Mahatma Gandhi’s statue : జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కోతులు ధ్వంసం చేశాయా ? లేక ఎవరైనా చేశారా ? అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాలలో ఉన్న గాంధీ విగ్రహం పాక్షికంగా ధ్వంసం కావడం కలకలం రేపింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండ్ సార్ జిల్లాలో చోటు చేసుకుంది. గుర్జర బార్ధియా గ్రామంలో స్థానికంగా ఓ పాఠశాల ఉంది. ఇందులో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం గాంధీ విగ్రహం ధ్వంసం కావడం గ్రామస్తులు గుర్తించారు. దీనిపై పాఠశాల కమిటీ పెద్దలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రిన్స్ పాల్ చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు అప్జల్ పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జి ఓపీ తంత్వర్ తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో తిరుగుతున్న కోతులే కారణమని భావిస్తున్నామని, దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని Mandsaur Superintendent of Police Siddharth Choudhary వెల్లడించారు. పాఠశాల వాచ్ మెన్ రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వహించినట్లు తెలిసిందని, ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుందన్నారు. మరి ఈ విగ్రహాన్ని కోతులు ధ్వంసం చేశాయా ? లేదా ? అనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడికానుంది.

ట్రెండింగ్ వార్తలు