Karnataka: ఆ రోజు నేను మాంసమే తినలేదు.. యూటర్న్ తీసుకున్న సిద్ధరామయ్య

నేను 2:30 నిమిషాలకు సుదర్శన్ గెస్ట్ హైస్‭లో భోజనం చేశాను. సాయంత్రం చాలా సేపటికి గుడికి వెళ్లి పూజ చేశాను. ఈ ఆహారమే తిని గుడికి రావాలని దేవుడేమైనా షరతులు పెట్టాడా? ప్రజలు రాత్రి మాంసం తిని ఉదయమే గుడికి వెళ్తారు. మరి మధ్యాహ్నం మాసం తిని సాయంత్రం గుడికి వెళ్తే తప్పేంటి?

Did not eat meat the day sasy siddaramaiah over temple visit controversy

Karnataka: మాంసం తిని గుడికి వెళ్లారనే వ్యాఖ్యలపై ముందు అసెంబ్లీ సాక్షిగా సమర్ధించుకున్న కర్ణాటక విపక్షనేత సిద్ధరామయ్య.. తాజాగా యూటర్న్ తీసుకున్నారు. గుడికి వెళ్లిన రోజు తాను మాంసమే తినలేదని బుకాయించారు. మంగళవారం ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘‘మాంసం తినకూడదని దేవుడేమైనా చెప్పారా? ఎవరి ఆహారపు అలవాట్లు వారికి ఉంటాయి. కొందరు మాంసం తినరు. కొందరు తింటారు. నేను మాంసం తింటాం. అది వ్యక్తిగత విషయం’’ అని అన్నారు. అయితే మాంసం విషయమై సిద్ధు మాట మార్చడాన్ని నెటిజెన్లు తప్పు పడుతున్నారు. ఇంత సడెన్ గా యూటర్న్ ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

సిద్ధరామయ్య ఆలయడానికి వచ్చే ముందు మాంసాహారం తిన్నారని కర్ణాటక భారతీయ జనతా పార్టీ అధినేత నలిన్ కుమార్ కటీల్ విమర్శలు చేయగా.. ఈ వ్యాఖ్యలను సిద్ధూ తాజాగా అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ‘‘నేను 2:30 నిమిషాలకు సుదర్శన్ గెస్ట్ హైస్‭లో భోజనం చేశాను. సాయంత్రం చాలా సేపటికి గుడికి వెళ్లి పూజ చేశాను. ఈ ఆహారమే తిని గుడికి రావాలని దేవుడేమైనా షరతులు పెట్టాడా? ప్రజలు రాత్రి మాంసం తిని ఉదయమే గుడికి వెళ్తారు. మరి మధ్యాహ్నం మాసం తిని సాయంత్రం గుడికి వెళ్తే తప్పేంటి?’’ అని ప్రశ్నించారు. అయితే కొద్ది సమయంలోనే తాను గుడికి వెళ్లిన రోజు అసలు మాంసమే తినలేదని ఆయన అనడం గమనార్హం.

నలిన్ కుమార్ సోమవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘మధ్యాహ్నం మాంసాహారం తిని సాయంత్రం గుడికి వెళ్తే తప్పేంటని సిద్ధరామయ్య అంటున్నారు. ఇది మరోసారి హిందువుల మనోభావాలపై విరుచుకుపడటమే. దేవాలయాలపై హిందువులకు ఉన్న మనోభావాలను అర్థం చేసుకోని వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఇలాంటి వ్యక్తులకు ఎన్నికలు సమీపిస్తుంటే గుళ్లకు, మఠాలకు వెళ్లే డ్రామాలు ఎందుకో?’’ అని ట్వీట్ చేశారు.

కుక్కలు వెంటపడుతుంటాయి.. రైతు సంఘం నేతలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు