కుక్కలు వెంటపడుతుంటాయి.. రైతు సంఘం నేతలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

లఖింపూర్‭లో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో టికాయత్ మాట్లాడుతూ ‘‘నేను చాలా చిన్న వ్యక్తిని. ఆయన(అజయ్ మిశ్రా) చాలా పెద్ద వ్యక్తి. కానీ ఈరోజు సమావేశానికి ఇక్కడికి 50 వేల మంది వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లఖింపూర్‭లో గూండా రాజ్యం కొనసాగుతోంది. దాన్ని అంతం చేయాలని నినదిస్తున్నారు. స్వేచ్ఛాయుత లఖింపూర్‭ సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం’’ అని అన్నారు.

కుక్కలు వెంటపడుతుంటాయి.. రైతు సంఘం నేతలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Dogs Chase Cars says Minister Whose Son Is Accused Of Running Over Farmers

ఉత్తరప్రదేశ్‭లోని లఖింపూరి ఖేరిలో రైతులను తొక్కించి చంపించి జైలు పాలైన ఆశిష్ మిశ్రా తండ్రి, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తేని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు సంఘం నేతలను ఉద్దేశించి ‘‘కుక్కలు మొరుగుతుంటాయి. కారు వెంట కూడా పడుతుంటాయి’’ అని వ్యాఖ్యానించారు. మంగళవారం లఖింపూర్‭లోని తన కార్యాలయంలో తన మద్దతుదారులతో సమావేశమైన సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మీడియా, రైతులు అని పిలవబడే వారు, జాతీయేతర రాజకీయ పార్టీలు నడిపేవారు, ఉగ్రవాదులు పాకిస్తాన్, కెనడాలో కూర్చొని నన్ను ఇంత పాపులర్ చేస్తారని అనుకోలేదు. దీనికంతటికీ కారణం మీరే (మద్దుతదారులను ఉద్దేశించి). మీవల్ల నన్ను ఎలా ఓడించాలో కూడా వారికి అర్థం కావడం లేదు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగతాయి. అలాగే వీళ్లు కూడా మొరుగుతున్నారు. ఉదహారణకి నేను లఖ్‭నవూ వెళ్తుంటే నా కారు వెంబడి కుక్కలు మొరుగుతూ పరిగెడుతుంటాయి. నేను వాటిని పట్టించుకోను’’ అని అన్నారు.

ముఖ్యంగా భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయత్‭ను ఉద్దేశించిన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎంత మంది రాకేశ్ టికాయత్‭లు వస్తారో రమ్మనండి. నాకొచ్చిన ఇబ్బందేమీ లేదు. టికాయత్ గురించి నాకు బాగా తెలుసు. అతడు మొదటి వరుసలో కూర్చునే అర్హత లేని వ్యక్తి. ఎన్నికల్లో పోటీ చేశారు. డిపాజిట్ కూడా రాలేదు. ఇలాంటి వ్యక్తులు నిరసనలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేనసలు వీటిపై స్పందించను కూడా. ఈ విధంగానైనా వారు రాజకీయం చేయదల్చుకుంటే చేసుకోనివ్వండి’’ అని అన్నారు.

దీనికి ముందు లఖింపూర్‭లో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో టికాయత్ మాట్లాడుతూ ‘‘నేను చాలా చిన్న వ్యక్తిని. ఆయన(అజయ్ మిశ్రా) చాలా పెద్ద వ్యక్తి. కానీ ఈరోజు సమావేశానికి ఇక్కడికి 50 వేల మంది వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లఖింపూర్‭లో గూండా రాజ్యం కొనసాగుతోంది. దాన్ని అంతం చేయాలని నినదిస్తున్నారు. స్వేచ్ఛాయుత లఖింపూర్‭ సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం’’ అని అన్నారు.

Karnataka: బీజేపీ మంట పెడితే కాంగ్రెస్ పెట్రోల్ పోస్తోంది: సావర్కర్ అంశంపై మాజీ సీఎం