డిగ్గీరాజాకు పెద్ద సవాల్ : గెలిపించుకుంటాం – జయవర్ధన్ సింగ్

  • Publish Date - March 25, 2019 / 08:10 AM IST

భోపాల్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను అందరం కష్టపడి గెలిపించుకుంటామని ఆయన కుమారుడు జయవర్ధన్‌ సింగ్‌ చెప్పారు. గత ఐదేళ్ల మోదీ పాలనలోని వైఫల్యాలే ప్రధానంగా ప్రచారం చేయనున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌ నాథ్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తమని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 70 రోజులలోనే  83 కన్నా ఎక్కువ హామీలను సిఎం కమల్‌నాథ్‌ నెరవేర్చారని జయవర్ధన్‌ సింగ్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే 30 ఏళ్లలో కాంగ్రెస్ గెలవని భోపాల్ నుంచి పోటీకి పెట్టడంతో డిగ్గీరాజా పెద్ద సవాలునే ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ పదవీకాలం 2020 వరకు ఉంది. 2019 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గర్‌ నుంచి పోటీ చేయాలనుకున్నట్లు చెప్పారాయన. ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ఇప్పుడు భోపాల్ నుంచి దిగకతప్పడంలేదు డిగ్గీరాజాకు.

భోపాల్‌లో కాంగ్రెస్ తరపున  చివరిసారిగా కెఎన్ ప్రధాన్ 1984లో విజయం సాధించారు. ఆ తర్వాత ఎప్పుడూ కాంగ్రెస్ ఇక్కడ గెలుపు రుచి చూడలేదు. భోపాల్ నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ ఆయన రాజకీయ జీవితానికి ఓ పరీక్షనే చెప్పాలి. భోపాల్‌లో నాలుగున్నరలక్షల మైనార్టీ ఓటర్లు ఉన్నారు. వీరంతా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపితే..బిజెపికి మైనస్‌గా కన్పిస్తోన్న పాయింట్ అని