Arvind Kejriwal
Delhi CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు డీఐపీ (ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ డైరెక్టరేట్) షాకిచ్చింది. రూ. 164 కోట్లు చెల్లించాలని రికవరీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ మొత్తాన్ని పది రోజుల్లో చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. 31 మార్చి 2017 వరకు ప్రకటనల కోసం ఖర్చుచేసిన మొత్తం రూ. 99.31 కోట్లు, ఈ మొత్తంపై జరిమానా వడ్డీగా మిగిలి రూ. 64.31 కోట్లు మొత్తం కలిపి సుమారు రూ. 163,61,88,265 చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.
2015- 2017 మధ్యకాలంలో ప్రభుత్వ ప్రకటనల ముసుగులో ప్రచురించిన రాజకీయ ప్రకటనలకోసం ఆప్ నుంచి రూ. 97కోట్లను రికవరీ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రధాన కార్యదర్శిని ఇటీవల ఆదేశించిన విషయం విధితమే. లెఫ్టినెంట్ గవర్నర్ చర్య తీసుకున్న దాదాపు నెల తర్వాత ఈ రికవరీ నోటీసులను డీఐపీ జారీ చేసింది. అయితే, ఈ మొత్తాన్ని పది రోజుల్లో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెల్లించక పోతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మునుపటి ఆదేశాల ప్రకారం పార్టీ ఆస్తులను అటాచ్‌మెంట్‌తో సహా అన్ని చట్టపరమైన చర్యలు సమయానుకూలంగా తీసుకొనబడతాయని డీఐపీ తన రికవరీ నోటీసులో పేర్కొంది.
https://twitter.com/msisodia/status/1613402592524267521?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1613402592524267521%7Ctwgr%5E41a814295da2483e37ea57f3dbc0785f97d1507f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fmsisodia%2Fstatus%2F1613402592524267521
ఈ విషయంపై ఆప్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆప్ ముఖ్యమంత్రులను బీజేపీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లక్ష్యంగా చేసుకొని నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. గత ఏడాది 20న లెఫ్టినెంట్ గవర్నర్ ఆప్ నుంచి రూ. 97కోట్లు వసూలు చేయాలని ఆదేశించడంపై ఆప్ స్పందిస్తూ అలాంటి ఉత్తర్వులను ఆమోదించే అధికారం తనకు లేదని పేర్కొంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు చట్టం దృష్టిలో నిలబడవని ఆయన కొట్టిపారేశారు. ఈ క్రమంలో తాజాగా నోటీసులు రావడం ఆప్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.