AIIMS Director : అంతవరకు ఎవరూ సురక్షితం కాదు – గులేరియా

దేశంతో కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

AIIMS Director : దేశంతో కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

సూపర్ స్ప్రెడర్ కార్యక్రమాల ప్రభావం మూడు వారాల తర్వాత తెలుస్తుంది. ఇటువంటి వాటి వలన కరోనా కేసుల తీవ్రత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని కట్టడి చెయ్యాల్సిన వసరం ఉందని వివరించారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాల్సిందే అని గులేరియా హెచ్చరించారు.

ఇదే ఇదే సమయంలో బూస్టర్ డోసులపై స్పందించారు. బూస్టర్ డోసుల అవసరంపై ఇంకా తగినన్ని ఆధారాలు లేవని తెలిపారు. ప్రపంచంలో అందరు సురక్షితంగా ఉండే వరకూ వ్యక్తిగతంగా ఏ ఒక్కరు సురక్షితంగా లేరనే భావించాలి. ఇక ప్రపంచ దేశాల్లో ఎదో ఓ చోట కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇవి ఇతర దేశాలకు కూడా పాకే అవకాశం ఉంటుంది.

దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలనీ ఆయన అభిప్రాయపడ్డారు. మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని.. మరే మార్గం లేదని తెలిపారు. అందరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు