Diwali special : మహిళల క్రియేటివిటీ ‘చాక్లెట్స్ క్రాకర్స్’..ఇవి పేలేవి కాదు తినేవీ

  • Publish Date - November 12, 2020 / 04:52 PM IST

Diwali Special womens sell Cracker Shaped Chocolates : దీపావళి వచ్చిందంటే చాలు చుట్టు పక్కల ఢాం ఢాం మని క్రాకర్స్ పేలుళ్లు రీ సౌండ్స్ వచ్చేస్తాయి. కానీ తినే క్రాకర్స్ గురించి విన్నారా? భూమిలో పాతి పెడితే మొలకలు వచ్చే క్రాకర్స్ గురించి విన్నారా? అదేంటీ పేలేవాటినే కదా క్రాకర్స్ అంటారు. మరి ఈ క్రాకర్స్ అంటారు పేలవంటారు. తినేవంటారు..మొలకలొస్తాయంటారేంటీ అనే కదా మీ డౌటు..అదే మరి ఈ దీపావళి స్పెషల్. దీపావళి వచ్చిదంటే వాయుకాలుష్యం..శబ్ద కాలుష్యంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటారు.



కానీ పండుగ అంటే ఒకరిని ఇబ్బంది పెట్టి చేసుకునేది కాదు కదా. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో దీపావళి కొత్తగా చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. న్యాయస్థానాలు కూడా అదే చెబుతున్నాయి. పండుగల కంటే ప్రజల జీవితాలే ముఖ్యమని ప్రజలు కరోనాతో కష్టాలు పడుతుంటే క్రాకర్స్ కాల్చి ఇబ్బందులకు గురిచేయటమేంటీ? ప్రజల జీవితాలు..వారి ఆరోగ్యం చాలా ముఖ్యం అని దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే.


ఈక్రమంలో పలువురు దీపావళిని వినూత్నంగా జరుపుకోవటానికి క్రాక్సర్స్ ను వినూత్నంగా తయారుచేస్తున్నారు. అటువంటి మహిళే కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ప్రియా జైన్. రకరకాల చాక్లెట్స్ తయారు చేయటం మంచి పేరుంది. ఈ దీపావళి సందర్బంగా ప్రియా జైన్ క్రాకర్స్ ఆకారంలో రకరకాల చాక్లెట్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు.


తారాచువ్వలు, చిచ్చుబుడ్డులు, కాకరపువ్వొత్తులు,మతాబులు, విష్ణు చక్రాలు, భూ చక్రాలు,లక్ష్మి బాంబులు వంటి పలు క్రాకర్స్ ఆకారంలో చాక్లెట్లు తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు ప్రియా జైన్. దీపావళి అంటే స్వీట్లే చాలా స్పెషల్. అందుకే తియ్యటి క్రాకర్స్ ను తయారు చేసారామె. ఈ కరోనా కాలంలో గ్రీన్ క్రాకర్స్ కు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ప్రియాజైన్ తనదైన శైలిలో ‘చాక్లెట్ క్రాకర్స్’ తయారు చేసి విక్రయిస్తున్నారు.


కాలుష్యానికి ప్రత్యామ్నాయంగా చాక్టెల్ క్రాకర్స్ లో రాణిస్తున్న నేషా ఛబ్రా..
నైనిటాల్‌కు చెందిన నేహా ఛబ్రా కాలుష్యానికి ప్రత్యామ్నాయంగా చాక్లెట్ క్రాకర్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. కరోనా కష్టకాలంలో అటు పర్యావరణానికి మంచి జరిగేలా మరోవైపు ఇంటికి చక్కటి ఆదాయవనరుగా ఇలా మహిళలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు.

నేహా ఛబ్రా తయారు చేసే ఈ చాక్లెట్లు వెరీ స్పెషల్. మధుమేహం ఉన్నవారు కూడా వీటిని తినొచ్చు. చక్కెర లేని క్రాకర్ చాక్లెట్లను పుదీనా, గుల్కాండ్, బటర్‌స్కోచ్, స్ట్రాబెర్రీ, ఆరెంజ్ వంటి రుచులలో తయారు చేయటంతో నేహా ప్రత్యేకతే వేరు. తన వినూత్న ఆలోచనతో దీపావళి పండుగను ఉపాధిగా మార్చుకున్నారు నేహా ఛబ్రా.

నేహాకు వంట చేయటమంటే చాలా ఇష్టం. వంటల్లో రకరకాలను తయారు చేస్తుంటారు. నేహాకు చాక్లెట్ క్రాకర్స్ కు మంచి డిమాండ్ కూడా ఉంది.

ఆమెకు నైనిటాల్ నుంచి మాత్రమే కాదు ఢిల్లీ, హిమాచల్, గుర్గావ్, ఫరీదాబాద్ వంటి పలు ప్రాంతాల నుంచి చాక్లెట్ క్రాకర్స్ కోసం పలు ఆర్డర్లు వస్తుంటాయి.

దీంతో ఆమె దీపావళి నెల రోజులు ఉందనగానే చాక్లెట్స్ క్రాకర్స్ తయారుచేయటం మొదలుపెట్టాస్తారు నేహా ఛబ్రా.