Diwali Special ‘Cashew Kalash’ : ‘కాజూ కలశ్’ మిఠాయి .. కిలో రూ.20,000

దీపావళికి ఓ ప్రత్యేకమైన స్వీటునుఅందుబాటులోకి తీసుకొచ్చారు ఓ స్వీటు షాపు యజమాని. ఈ స్వీటు ధర కిలో మిఠాయి రూ.20,000..!

Diwali Special Cashew Kalash Sweet

Diwali Special Cashew Kalash Sweet : దీపావళి వచ్చిందంటే మిఠాయిల దుకాణాల వారు రకరకాల మిఠాయిలు తయారు చేసి అమ్మటంలో బిజీబిజీగా ఉంటారు. కష్టమర్లను ఆకట్టుకోవటానికి రకరకాల రుచుల్లో..రకరకాల ఆకృతుల్లో స్వీట్లు తయారు చేసి అందుబాటులోకి తెస్తుంటారు. ముఖ్యంగా ఉత్తరాదిలో దీపావళి,దసరా పండుగలకు స్వీట్ల తయారీదారులు కాస్త ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. ప్రత్యకమైన స్వీట్లు తయారు చేస్తుంటారు. అటువంటి అద్భుతమైన మిఠాయిని అందుబాటులోకి తీసుకొచ్చారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఓ స్వీట్ షాపు యజమాని. కిలో మిఠాయి ధర అక్షరాలా రూ.20,000..!!

ఏంటీ బంగారంతో తయారు చేశారా ఏంటీ మరీ అంత ధర అని ఆశ్చర్యపోవచ్చు. నిజమే మరి అచ్చమైన బంగారాన్ని కూడా వేసి తయారు చేసారు ఈ మిఠాయిని. బంగారంతోతయారైనది కదా..ధర కూడా ఆరేంజ్ లోనే ఉంటుంది. ధరకు తగినట్లే ఆ మిఠాయి పేరు కూడా ప్రత్యేకంగా ఉంది. దాని పేరు ‘కాజూ కలశ్‌’ మిఠాయి. కేజీ రూ.20,000.

పైన్‌ గింజలు, కశ్మీర్‌లో లభించే కిశోరీ పిస్తా, కుంకుమపువ్వు వంటివి దట్టించి తయారు చేశారు ఈ ‘కాజూ కలశ్‌’ మిఠాయిని. అచ్చమైన 24 క్యారెట్ల బంగారాన్ని కూడా ఈ మిఠాయి తయారీలో ఉపయోగించడం విశేషం. ఈ ప్రత్యేకతల కారణంగానే తాము తయారుచేసిన ‘కాజూ కలశ్‌’కు మిగతా వాటితో పోల్చితే ప్రత్యేక రుచి లభిస్తుందని రోషన్‌లాల్‌ స్వీట్స్‌కు చెందిన రజత్‌ మహేశ్వరి చెప్పారు.