DK Shivakumar : కార్యకర్త చెంప చెల్లుమనిపించిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు కోపం వచ్చింది. తనపై చేయి వేసేందుకు ప్రయత్నించిన కార్యకర్తను లాగిపెట్టి కొట్టాడు శివకుమార్. ఈ ఘటన మండ్యలోని ఓ ఆసుపత్రి వద్ద జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత మద్దెగౌడను పరామర్శించడానికి డీకే శివకుమార్‌ వెళ్ళాడు.

Dk Shivakumar

DK Shivakumar : కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు కోపం వచ్చింది. తనపై చేయి వేసేందుకు ప్రయత్నించిన కార్యకర్తను లాగిపెట్టి కొట్టాడు శివకుమార్. ఈ ఘటన మండ్యలోని ఓ ఆసుపత్రి వద్ద జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత మద్దెగౌడను పరామర్శించడానికి డీకే శివకుమార్‌ వెళ్ళాడు.

ఇదే సమయంలో పార్టీ కార్యకర్త అతడిపై చేయివేసేందుకు ప్రయత్నించాడు. సహనం కోల్పోయిన డీకే లాగిపెట్టి చెంపపై కొట్టాడు. ప్రజల ముందు సక్రమంగా మసలుకోవాలని మందలించారు. ఈ సమయంలో తన చుట్టూ మీడియా ఉండనే సంగతి మరిచారు డీకే. ఘటన జరగ్గానే చుట్టూవున్నవారు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు.

ఇక ఈ ఘటనపై డీకే వివరణ ఇచ్చారు. సామాజిక దూరం పాటించకపోవడం వల్లనే తాను ఈ విధంగా చేయాల్సి వచ్చిందని తెలిపారు. వీడియో తొలగించాలని మీడియా ప్రతినిధులను కోరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా గతంలో కూడా డీకే ఓ యువకుడిపై చేయి చేసుకున్నాడు. 2018 ఎన్నికల సమయంలో బళ్లారిలో ప్రచారం నిర్వహిస్తుండగా సెల్ఫీ దిగేందుకు వచ్చిన యువకుడి చేతిపై కొట్టాడు. తన పనిలో తాను బిజీగా ఉన్న సమయంలో సెల్ఫీ తీయడం సరికాదని అప్పట్లో వివరణ ఇచ్చారు.