Aadhaar Card On WhatsApp: వాట్సాప్‌లోనే ఆధార్ కార్డ్.. చాలా సింపుల్.. ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్..

కొన్నిసార్లు మన దగ్గర ఫిజికల్ (భౌతిక) ఆధార్ కార్డ్ ఉండకపోవచ్చు. లేదా మీ ఫోన్‌లో స్టోర్ చేసుకున్న డిజిటల్ కాపీ మీకు దొరక్కపోవచ్చు.

Aadhaar Card On WhatsApp: ఆధార్.. చాలా కీలకమైన డాక్యుమెంట్. ఈ రోజుల్లో దాదాపు ప్రతిదానికీ ఆధార్ తప్పనిసరి ఐడీ. హోటల్ లో రూమ్ బుక్ చేసుకోవాలన్నా, బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, ఏదైనా సేవ కోసం మీ గుర్తింపును ధృవీకరించుకోవాలన్నా ఆధార్ అవసరం.

అయితే కొన్నిసార్లు మన దగ్గర ఫిజికల్ (భౌతిక) ఆధార్ కార్డ్ ఉండకపోవచ్చు. లేదా మీ ఫోన్‌లో స్టోర్ చేసుకున్న డిజిటల్ కాపీ మీకు దొరక్కపోవచ్చు. ఇలాంటి సమయంలో ఇబ్బందులు తప్పవు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఏం చేయాలి, ఆధార్ ను తక్షణమే డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా అని వర్రీ అవుతున్నారా? అలాంటి వారి కోసమే ఈ న్యూస్.

ఎటువంటి కష్టమైన ప్రాసెస్ లేకుండా, కొన్ని సులభమైన స్టెప్స్ లో మీ ఆధార్ కార్డును నేరుగా వాట్సాప్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మీకు తెలుసా. అవును.. చాలా సింపుల్ గా మన వాట్సాప్ లోనే ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం..

* మీ మొబైల్ నంబర్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయాలి.
* యాక్టివ్ డిజిలాకర్ ఖాతా కలిగుండాలి (డిజిలాకర్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా సులభంగా అకౌంట్ సృష్టించొచ్చు).
* అధికారిక ‘MyGov Helpdesk’ వాట్సాప్ నంబర్: +91-9013151515 (ఈ నంబర్‌ను మీ కాంటాక్ట్స్ లో సేవ్ చేయండి).

వాట్సాప్‌లో ఆధార్ డౌన్‌లోడ్ ఇలా చేసుకోండి.. స్టెప్ బై స్టెప్..

* మీ కాంటాక్ట్స్ లో +91-9013151515 ను ‘MyGov Helpdesk’ గా సేవ్ చేయండి.
* వాట్సాప్ తెరిచి సేవ్ చేసిన MyGov హెల్ప్‌డెస్క్ కాంటాక్ట్‌తో చాట్ ప్రారంభించండి.
* సంభాషణ ప్రారంభించడానికి ‘నమస్తే’ లేదా ‘హాయ్’ అని టైప్ చేయండి.
* ఆప్షన్స్ నుంచి డిజిలాకర్ సర్వీసెస్ పై క్లిక్ చేయాలి.
* మీకు DigiLocker ఖాతా ఉందా అని అడుగుతుంది. అవును లేదా కాదు ఎంచుకోండి. మీకు ఖాతా లేకపోతే, మీరు ముందుగా డిజిలాకర్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి.
* 12 అంకెల ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయండి.
* ఆ తర్వాత మీకు ఓటీపీ వస్తుంది.
* వాట్సాప్ చాట్ లో ఆ ఓటీపీని ఎంటర్ చేయండి.
* వెరిఫై అయ్యాక డిజిలాకర్ లో సేవ్ చేసుకున్న డాక్యుమెంట్స్ ను చాట్ బోట్ చూపిస్తుంది.
* సరైన నంబర్‌ను టైప్ చేయడం ద్వారా జాబితా నుండి ఆధార్‌ను ఎంచుకోండి.
* మీ ఆధార్ కార్డు PDF ఫార్మాట్‌లో మీ వాట్సాప్ చాట్‌లోనే డెలివరీ అవుతుంది.

దీని వల్ల ఉపయోగాలు ఏంటి?
* ఫిజికల్ కాపీలు లేదా డిజిటల్ ఫైళ్ల కోసం వెతుకుతూ సమయం వృధా చేయనవసరం లేదు.
* పూర్తిగా సురక్షితం, అధికారిక ప్రభుత్వ సేవల మద్దతు.
* మీరు తొందరలో ఉన్నా లేదా ప్రయాణిస్తున్నా కూడా పనిచేస్తుంది.
* వెబ్‌సైట్లు లేదా యాప్‌లను విడివిడిగా సందర్శించాల్సిన అవసరం లేదు. జస్ట్ WhatsApp ఉపయోగించండి.

ఈ సులభమైన WhatsApp ఆధారిత పరిష్కారంతో మీరు మీ ఆధార్ PDFని ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎక్కువ శ్రమ లేకుండా పొందొచ్చు. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు.. మీ అఫీషియల్ కాపీ నిమిషాల్లో సిద్ధంగా ఉంటుంది. మీ జీవితాన్ని ఇబ్బంది లేకుండా చేస్తుంది. అంతేకాదు మీ వ్యక్తిగత డేటాను సురక్షితంగా ఉంచుతుంది.

Also Read: ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్.. యూపీఐ కొత్త రూల్స్ వచ్చేశాయ్.. కీలక మార్పులు ఇవే..