Black Money: బీజేపీ హయాంలో నల్లధనం ఎంత జప్తు చేశారో తెలుసా? కేంద్ర మంత్రి ఏమన్నారంటే..

కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గతంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను గుర్తుచేశారు. పేదల సంక్షేమంకోసం అందించే రూపాయిలో 15పైసలు మాత్రమే వారికి చేరుతోందని అన్నారని, నేడు ప్రధాని మోదీ హయాంలో మాత్రం 100శాతం డబ్బులు బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు చేరుతోందని అన్నారు.

Black Money

Black Money:బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు రూ. 1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని జప్తుచేసిందని, రూ. 4,300 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను అటాచ్ చేయగా, 1.75లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం తెలిపారు. ఢిల్లీలోని రైల్‌భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో సుపరిపాలన మోడల్‌లో పారదర్శకతే అత్యంత కీలకమైన అంశమని తెలిపారు. ప్రధాని మోదీ తన సుదీర్ఘ ప్రజా జీవితంలో గుజరాత్‌లో ప్రారంభించిన సుపరిపాలన మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో అమలవుతోందని అన్నారు.

Black Money : స్విస్‌ బ్యాంకుల్లో భారీగా పెరిగిన భారతీయుల బ్లాక్‌ మనీ

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి .. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను గుర్తుచేశారు. పేదల సంక్షేమంకోసం అందించే రూపాయిలో 15పైసలు మాత్రమే వారికి చేరుతోందని అన్నారని, నేడు మాత్రం 100శాతం డబ్బులు డిబిటి (డైరెక్టర్ బ్యాంక్) ద్వారా లబ్ధిదారులకు చేరుతోందని అన్నారు. దేశంలోని ప్రతి వ్యక్తికి సుపరిపాలన అందేలా చూడడానికి ప్రధాని మోదీ డిజిటల్ నిర్మాణాన్ని సిద్ధం చేశారని అన్నారు.

Lady blackmailer case: నేను పెదవి విప్పితే ప్రభుత్వం కూలిపోతుంది.. ఎవరినీ వదిలిపెట్టను.. బ్లాక్ మెయిలర్ అర్చన నాగ్

2014 నుండి 2022 వరకు స్పెక్ట్రమ్ వేలం ఇప్పటికే రూ. 4.5 లక్షల కోట్లు సంపాదించింది. అంటే వ్యవస్థలో చాలా అవినీతి తొలగించబడింది. ఆ డబ్బు అంతా ప్రభుత్వానికి వస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రధాని సుపరిపాలన కారణంగానే 2019లోనూ ప్రజలు బీజేపీకి అధికారమిచ్చారని అన్నారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇందుకు నిదర్శనమని తెలిపారు.