Doctor Eats Cow Dung
Doctor Eats Cow Dung : మన దేశంలో గోవుని కామధేనువుగా కొలుస్తారు. గోమాతను పూజిస్తారు. అంతేనా గో మూత్రం ఇంట్లో చల్లితే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. దానికి తోడు ఆరోగ్యానికి మంచిదని, పొట్టను శుద్ధి చేసే గుణం ఉందని గోవు మూత్రం తాగేవాళ్లూ లేకపోలేదు. ఇక్కడి వరకు అందరికి తెలుసు.. కానీ, ఆవు పేడ కూడా ఆరోగ్యానికి మంచిదే, ఎన్నో లాభాలను కలిగిస్తుందని చెప్పే వాళ్లను, ఆవు పేడను తింటున్నట్టుగా ఉన్న వీడియోలు మాత్రం చూసి ఉండకపోవచ్చు.
కానీ, ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి అదీ ఓ డాక్టర్.. స్వయంగా ఈ విషయాన్ని తెలిపాడు. ఆవు పేడ తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పడమే కాదు అది నిజమని చెప్పడానికి తానే తిని చూపించాడు. ఆవు పేడను తింటూ వాటి ప్రయోయోజనాలను వివరించే వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇకపై రేప్ చేస్తే అది లేకుండా చేస్తారు.. రేపిస్టులు భయపడేలా కొత్త చట్టం
వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి తనని తాను డా మనోజ్ మిట్టల్‌గా పరిచయం చేసుకున్నాడు. ట్విటర్ ప్రొఫైల్ లో తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని కర్నల్‌లో పిల్లల స్పెషలిస్ట్ డాక్టర్‌గా పని చేస్తున్నట్టు తెలిసింది. సదరు వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఓ గోశాలలో ఉన్న డాక్టర్.. కింద పడున్న ఆవు పేడను చేతిలోకి తీసుకున్నాడు. ఆ తర్వాత కొంచెం చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఆవు పేడను తిన్నాడు. ఆ తర్వాత ఆవు పేడతో కలిగే ప్రయోజనాలు వివరించాడు. ఆవు పేడ, ఆవు మూత్రంతో అనేక రకాల వ్యాధులు రాకుండా నివారించ వచ్చని చెప్పుకొచ్చాడు. అంతేకాదు మరో సలహా కూడా ఇచ్చాడు. గర్భిణులు ఆవు పేడ తిన్నట్టయితే.. వారికి సిజేరియన్ అవసరం లేకుండా సహజపద్ధతిలో కాన్పు (డెలివరీ) అవుతారని సెలవిచ్చాడు. ఆవు పేడ తినడంతోనే శరీరం, మైండ్ శుద్ధి అవుతాయని.. ఆవు పేడకు అంతటి మహత్యం ఉందని చెబుతున్నాడు.
Kamakshi Plant : కాలేయ వ్యాధుల నుండి కాపాడే కామాక్షి మొక్క
ఆవు పేడ తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆత్మను శుభ్రపరిచే సామర్థ్యం ఆవు పేడకు ఉందని అతాగాడు చెప్పుకొచ్చాడు. తన తల్లి ఉపవాస సమయంలో పేడను తినేదని, దానివల్ల ఆమె చాలా శక్తిమంతురాలిగా ఉండేదని తెలిపాడు.
ఆవు పేడను తింటూ వాటి ప్రయోజనాలు డాక్టర్ వివరించే వీడియో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అతడి వాదనతో ఏకీభవిస్తుండగా.. ఇంకొంతమంది మాత్రం అతడిని ఏకిపారేస్తున్నారు. డాక్టర్ అని చెప్పుకుంటూ ఈ రకమైన సలహాలు ఇస్తున్నందుకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అతడిపై చర్యలు తీసుకోవాలని, అతడి లైసెన్స్ రద్దు చేయాలంటూ మండిపడుతున్నారు.
Dr. Manoj Mittal MBBS MD’s prescription. Via @ColdCigar pic.twitter.com/SW2oz5ao0v https://t.co/Gzww80KiSs
— Rofl Gandhi 2.0 ?? (@RoflGandhi_) November 16, 2021