Chemical Castration: ఇకపై రేప్ చేస్తే అది లేకుండా చేస్తారు.. రేపిస్టులు భయపడేలా కొత్త చట్టం

రేప్ చేయాలంటే భయపడేలా పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తోంది. అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులకు లైంగిక సామర్థ్యం లేకుండా చేయాలని నిర్ణయించింది.

Chemical Castration: ఇకపై రేప్ చేస్తే అది లేకుండా చేస్తారు.. రేపిస్టులు భయపడేలా కొత్త చట్టం

Chemical Castration

Chemical Castration: రేప్ చేయాలంటే భయపడేలా పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తోంది. అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులకు లైంగిక సామర్థ్యం లేకుండా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కీలక నేరచట్టం-2021 బిల్లుకు పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్ లో పెరిగిపోతున్న అత్యాచారాలను కట్టడి చేసేందుకు దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో తక్షణ చర్యల కోసం ఈ బిల్లును రూపొందించింది. గతేడాదే ఈ బిల్లుకు పాక్ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Urine : మూత్రం ఎరుపులో రంగులో ఉంటే డేంజర్లో పడ్డట్టేనా…

అత్యాచార కేసుల్లో దోషులకు లైంగిక సామర్థ్యం తొలగించే ప్రక్రియను కెమికల్ కాస్ట్రేషన్‌గా పిలుస్తారు. ఈ ప్రక్రియ కోసం డాక్టర్లు డ్రగ్స్ ఉపయోగించి దోషులు శృంగారం చేయడానికి పనికిరాకుండా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే దక్షిణ కొరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్ సహా అమెరికా వంటి రాష్ట్రాల్లో ఈ శిక్షను అమలు చేస్తున్నారు. కాగా రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ శిక్ష విధించడం సరికాదని జమాత్ ఎ ఇస్లామి సెనేటర్ ముస్తాక్ అహ్మద్ నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఇస్లాంకు వ్యతిరేకం అని ఆయన అభిప్రాయపడ్డారు.

Kamakshi Plant : కాలేయ వ్యాధుల నుండి కాపాడే కామాక్షి మొక్క

పాకిస్తాన్‌లో ఇటీవల మహిళలు, పిల్లలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నేరాలను సమర్థవంతంగా అరికట్టాలని డిమాండ్ పెరుగుతోంది. ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ కొత్త అత్యాచార నిరోధక ఆర్డినెన్స్‌ను ఆమోదించిన దాదాపు ఏడాది తర్వాత బిల్లు ఆమోదం పొందింది. క్రిమినల్ లా (సవరణ) బిల్లు 2021 బిల్లుతో పాటు 33 ఇతర బిల్లులను పార్లమెంట్ ఉమ్మడి సెషన్ ఆమోదించింది. కోర్టు నిబంధనలు, మెడికల్ బోర్డు సూచనల ప్రకారం వ్యక్తి శరీరంలోకి రసాయనం ఎక్కిస్తారు. దీంతో ఆ వ్యక్తి లైంగికంగా పనికిరాకుండా పోతాడు. బహుళ అత్యాచారాలకు పాల్పడిన లైంగిక నేరస్తులకు కెమికల్ కాస్ట్రేషన్‌ శిక్ష వేస్తారు.