Madhya Pradesh: ఐఎంఏ వార్షిక సమావేశంలో కొట్టుకున్న డాక్టర్లు

రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‭కే పాఠక్ మాట్లాడుతూ ‘‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకూడదు. వాగ్వాదం తర్వాత ఐఎంఏ సభ్యులంతా ఒక చోట కూర్చొని ఏదైనా పొరపాటు జరిగితే క్షమించని చర్చించుకున్నారు. దీనిపై కమిటీ వేసి విచారణ జరిపిస్తాం’’ అని అన్నారు.

Madhya Pradesh: జబల్‭పూర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వార్షి సమావేశం నడుస్తోంది. సమావేశానికి హాజరైన డాక్టర్లను ఉద్దేశించి ఒక వక్త ప్రసంగిస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి వక్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. చూస్తుండగానే కొంత మంది డాక్టర్లు పోడియం వద్దకు వెళ్లారు. ఒక్కసారిగా ఒకరికొకరు దాడి చేసుకోవడం ప్రారంభించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‭పూర్‭లో ఆదివారం జరిగింది ఈ ఘటన.

ఈ విషయమై నూతనంగా ఎన్నికైన జబల్‭పూర్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అభిజిత్ బిష్ణోయి స్పందిస్తూ.. జబల్‭పూర్ ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అమరేంద్ర పాండే ప్రారంభోపన్యాసం చేస్తుండగా గ్వాలియర్‭కు చెందిన డాక్టర్లు అభ్యంతరం చెబుతూ ఆయనపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‭కే పాఠక్ మాట్లాడుతూ ‘‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకూడదు. వాగ్వాదం తర్వాత ఐఎంఏ సభ్యులంతా ఒక చోట కూర్చొని ఏదైనా పొరపాటు జరిగితే క్షమించని చర్చించుకున్నారు. దీనిపై కమిటీ వేసి విచారణ జరిపిస్తాం’’ అని అన్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. డాక్టర్లు వార్షిక సమావేశంలో ఇలా ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నాయి.

iPhone Factory: చైనాలో ఐఫోన్ ఫ్యాక్టరీలో విజృంభిస్తున్న కోవిడ్.. భయంతో పారిపోతున్న కార్మికులు.. వీడియోలు వైరల్

ట్రెండింగ్ వార్తలు