iPhone Factory: చైనాలో ఐఫోన్ ఫ్యాక్టరీలో విజృంభిస్తున్న కోవిడ్.. భయంతో పారిపోతున్న కార్మికులు.. వీడియోలు వైరల్

చైనాలోని ఐఫోన్ల తయారీ ఫ్యాక్టరీలో కోవిడ్ విజృంభిస్తోంది. అయితే, అధికారులు మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో భయాందోళనకు గురైన కార్మికులు అక్కడ్నుంచి గేట్లు, ఫెన్సింగ్ దూకి పారిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

iPhone Factory: చైనాలో ఐఫోన్ ఫ్యాక్టరీలో విజృంభిస్తున్న కోవిడ్.. భయంతో పారిపోతున్న కార్మికులు.. వీడియోలు వైరల్

iPhone Factory: చైనాలో కోవిడ్ విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. చైనాలో ఉన్న ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీలో కోవిడ్ విజృంభిస్తుండటంతో అక్కడ ఉండలేక కార్మికులు ఫ్యాక్టరీ దాటి పారిపోతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చైనాలోని హెనాన్ ప్రావిన్స్, జెంగ్జోవు సిటీ పరిధిలో అతిపెద్ద ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీ ఉంది.

PM Modi: గుజరాత్ ప్రమాద స్థలానికి మోదీ.. మంగళవారం పర్యటించనున్న ప్రధాని

ఫాక్స్‌కాన్ కంపెనీ పేరుతో ఉన్న ఈ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున ఐఫోన్లు తయారు చేస్తుంటారు. ఇక్కడ దాదాపు 20,000 మంది కార్మికులు ఉంటున్నట్లు అంచనా. అయితే, ఇటీవల ఇక్కడ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి అధికారులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. అయితే, సరైన వైద్య సదుపాయంతోపాటు, ఇతర వసతులు కల్పించడం లేదు. ఆహారం కూడా సరిపడినంతగా అందించడం లేదు. కోవిడ్ నియంత్రణా చర్యలు అంతంతమాత్రమే. దీంతో అక్కడ పనిచేసే కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఫ్యాక్టరీలో ఎంతమందికి కరోనా సోకింది.. వారి పరిస్థితి ఏంటి అనే విషయంలో స్పష్టత లేదు.

Chhath Puja: చాత్ పూజ చేస్తుండగా కూలిన కల్వర్టు… నీటిలో పడిపోయిన భక్తులు.. తప్పిన ప్రమాదం

ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉంటే ప్రమాదమని భావించిన చాలా మంది కార్మికులు ఫ్యాక్టరీ నుంచి పారిపోతున్నారు. నిజానికి అక్కడి కార్మికులు అనుమతి లేకుండా బయటకు వెళ్లే అవకాశం లేదు. దీంతో వాళ్లంతా గేట్లు దూకి పారిపోతున్నారు. అవసరమైన లగేజ్, కొన్ని వస్తువులు మాత్రమే తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతున్నారు. కోవిడ్ సోకే అవకాశం ఉండటంతోపాటు, సరైన సౌకర్యాలు లేని కారణంగా వీళ్లంతా వెళ్లిపోతున్నారు. అక్కడి వీధులన్నీ పారిపోతున్న కార్మికులతో కనిపిస్తున్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన దృశ్యాల్ని అక్కడి మీడియా ప్రతినిధులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.