Indian Railway : భారత్‌లోని ఆ రైల్వే ట్రాక్‌‌కు ఇప్పటికి బ్రిటిష్ ప్రభుత్వానికి రైల్వే శాఖ అద్దె కడుతోందా..?!

బ్రిటీష్ వారు భారతదేశాన్ని 200ల ఏళ్లు పాలించారు. భారత్ కు చెందిన లెక్క కట్టలేనంత సంపదను దోచుకుపోయారు. ఎన్నో హింసలను పొందిన భారతీయులు బ్రిటీష్ వారిపై పోరాటం చేసి ఎట్టకేలకు భారత్ కు తెల్లదొరల కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించారు. కానీ స్వాతంత్ర్యం పొందిన ఇన్నాళ్టికి కూడా భారత్ ఓ రైల్వే లైన్ కు సంబంధించి బ్రిటీష్ వారికి అద్దె కడుతోందా? దీనిపై భారత రైల్వే శాఖ క్లారిటీ..

Yavatmal and Murtijapur Shakuntala Railway line

Indian Railway: బ్రిటీష్ వారు భారతదేశాన్ని 200ల ఏళ్లు పాలించారు. భారత్ కు చెందిన లెక్క కట్టలేనంత సంపదను దోచుకుపోయారు. ఎన్నో హింసలను పొందిన భారతీయులు బ్రిటీష్ వారిపై పోరాటం చేసి ఎట్టకేలకు భారత్ కు తెల్లదొరల కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం అనేది ఓ పెద్ద ఘట్టం. ఇలా భారతీయుల పోరాటానికి తెల్లదొరలు పలాయనయం చిత్తగించటంతో 1947 ఆగస్టు 15న భారతకు స్వాత్రంత్ర్యం లభించింది. బ్రిటీష్ పాలనలో భారతీయులు ఎన్నో పన్నులు కట్టేవారు తెల్లదొరలకు..భారత్ ను పాలిస్తు..భారత సంపదను తమదేశానికి తరలించుకుపోతునే మరోపక్క భారతీయులతో పన్ను (కప్పం, సుంకం) కట్టించుకునేవారు బ్రిటీష్ వారు. కానీ భారత్ స్వాతంత్ర్యం పొందాక భారతీయు ఇక పూర్తిగా స్వేచ్చ పొందారు. బ్రిటీష్ వారికి ఎటువంటి పన్ను కట్టాల్సిన అవసరం లేకుండాపోయింది స్వాతంత్ర్యం లభించటంతో..

కానీ భారత్ ఇప్పటికి బ్రిటీష్ వారికి ‘అద్దె’ (పన్నులేదా సుంకం, రెంట్ ఏదైనా అనుకోవచ్చు) ఓ ప్రాంతం ఉందని..బ్రిటీష్ వారి పాలన నుంచి స్వాతంత్ర్యం పొందాక కూడా ఈనాటికి భారత్ లోని ఓ ప్రాంతానికి బ్రిటీష్ వారికి ‘అద్దె‘కడుతునే ఉందట..భారత రైల్వే శాఖకు చెందిన ఆ ప్రాంతానికి సంబంధించి ఈనాటికి భారత రైల్వే అద్దెకడుతోందంట.. బ్రిటీష్ వారికి మహారాష్ట్రాలోని యావత్మాల్‌-ముర్తిజాపుర్‌ మధ్య ఉన్న రైల్వే లైన్‌ కోసం రూ.కోటి ‘అద్దె’కడుతోందట..!!

మహారాష్ట్రలోని యావత్మాల్‌-ముర్తిజాపుర్‌ మధ్య ఉన్న రైల్వే లైన్‌ను బ్రిటిష్‌ పాలకులు నిర్మించారు. (భారత్ నుంచి సంపద తరలించుకుపోవటానికి బ్రిటీష్ వారు పలు రైలు మార్గాలు నిర్మించారు) కానీ భారతీయుల చేసిన పోరాటంతో బ్రిటీష్ వారు దేశం విడిచిపోయినా..ఆ లైన్‌ ఇంకా వారి ఆధీనంలోనే ఉండటం గమనించాల్సిన విషయం. 1952లో రైల్వేల జాతీయీకరణ సమయంలో ఈ లైన్‌ను మరిచిపోయారట అధికారులు. ఫలితంగా ఆనాటి నుంచీ బ్రిటిషర్లకు రూ.కోటి కడుతోందంటారు.

శకుంతల రైల్వే లైన్ అనే పేరున్న ఈ  రైల్వే లైన్‌ అమరావతి జిల్లాలోని నిరుపేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. 190 కిలోమీటర్ల పొడవైన నారోగేజ్ రైలు మార్గంలో రైళ్లను నడపటానికి భారతదేశం బ్రిటీష్ వారికి రూ.కోటి అద్దె చెల్లిస్తోందట. 20 గంటలపాటు సాగే ఈ ప్రయాణానికి రూ.150 టికెట్‌ ధరగా పెట్టింది రైల్వే. సిగ్నలింగ్‌, టికెట్ల విక్రయం, క్యారేజీల నుంచి ఇంజిన్‌ వేరు చేసేందుకు ఈ లైన్‌లో ప్రస్తుతం ఏడుగురు సిబ్బంది పని చేస్తున్నారు. నారో గేజ్‌గా ఉన్న యావత్మాల్‌- ముర్తిజాపుర్‌ రైల్వే మార్గాన్ని బ్రాడ్‌ గేజ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం అప్పటి రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు రూ.1,500 కోట్లను కేటాయించారు.

నారో గేజ్ రైల్వే ఉద్దేశ్యం పత్తిని యవత్మాల్ నుండి ముంబైకి రవాణా చేయడం. అక్కడ అది ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు రవాణా చేయబడుతుంది. 1910లో..కిల్లిక్-నిక్సన్ అనే ప్రైవేట్ బ్రిటిష్ కంపెనీ శకుంతల రైల్వేస్‌ను స్థాపించింది. ప్రస్తుతం అమరావతి జిల్లాలోని యావత్మాల్‌-అచల్‌పూర్‌ మధ్య రైల్వేలో 190 కి.మీ ప్రయాణానికి 20 గంటల సమయం పడుతోంది.

కానీ ఈ విషయం గురించి సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో శివాజీ సుతార్ మాట్లాడుతూ..భారతీయ రైల్వే భూమిలో నారో గేజ్ లైన్ నిర్మించబడింది. కానీ దీనికి బ్రిటీషర్లకు రైల్వే కంపెనీ..బ్రిటిషర్లకు ఏమీ చెల్లించడంలేదన్నారు.  శకుంతల రైల్వే లైన్ కోసం భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లిస్తోందన్న వార్తలను భారతీయ రైల్వే ఖండిస్తోంది.  ప్రస్తుతం ఈ రైలు మార్గంలో ఎలాంటి రైలు సేవలు నడవడం లేదని రైల్వే శాఖ కూడా చెబుతోంది. కానీ రైల్వే శాఖ మాత్రం బ్రిటీష్ వారికి అద్దె చెల్లిస్తోందని సమాచారం.