Air Fare Charges
Domestic Airfare Charges : కరోనా మహమ్మారి అన్ని రంగాలకు అతాలకుతలం చేసేసింది. ఈ రంగం ఆ రంగం తేడా లేకుండా..కష్టాల పాలు చేసేసింది. కంపెనీలు, ఇతర సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గతంలో కంటే..ప్రస్తుతం తక్కువ సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. సంస్థలు కోలుకొనేందుకు యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి. విమానయాన రంగం కూడా నష్టాల బారిన పడిపోయింది. దీంతో ఈ రంగాన్ని కోలుకోవాలంటే..ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
అందులో భాగంగా…విమానయాన ధరలు జూన్ 01వ తేదీ నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెరగనున్నాయి. 40 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ. 2 వేల 300 నుంచి రూ. 2 వేల 600 వరకు ఉండనుంది. ఇక 60 నిమిషాల ప్రయాణానికి ప్రయాణ ఛార్జీ రూ. 2 వేల 900 నుంచి రూ. 3 వేల 300కు పెరగనుంది.
విమానయాన రంగానికి ఊతమిచ్చేలా మంత్రిత్వ శాఖ ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకుందని సమాచారం. అంతర్జాతీయంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈ రంగం తీవ్రంగా నష్టపోయింది.
Read More : Chittoor: సంచలనం సృష్టించిన పలమనేరు యువకుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్