×
Ad

మాకు ఈ రూ.30 లక్షలు వద్దు.. నా చెల్లిని నాకు తెచ్చివ్వండి: తమిళనాడు యువతి

"మేము సాయంత్రం 4 గంటలకు కాల్ చేశాం, కానీ ఆమె ఫోన్ రిసీవ్ చేయలేదు. మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ స్పందన లేదు" అని తెలిపింది.

Karur stampede

Karur stampede: తమిళనాడులోని కరూర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన వారికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సీఎం సహాయ నిధి నుంచి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, టీవీకే అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ రూ.20 లక్షల చొప్పున ప్రకటించారు. అయితే, ఆ డబ్బంతా తమకేమీ వద్దని, తొక్కిసలాటలో చనిపోయిన తన సోదరిని తనకు కావాలని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది.

బృందా (22) అనే అమ్మాయి విజయ్‌కు వీరాభిమాని. నిన్న కరూర్‌లో జరిగిన ర్యాలీకి ఎంతో ఉత్సాహంగా వెళ్లింది. ఆమె రెండు ఏళ్ల కుమారుడిని తన అక్క దగ్గర వదిలి వెళ్లింది. కొన్ని గంటల తరువాత.. కరూర్ ర్యాలీలో 40 మంది మృతి చెందగా సుమారు 100 మందికి గాయమైంది, బృందా అక్కడే మరణించింది.

Also Read: “ఆయన నల్లమల పులి కాదు.. నల్లమల నక్క..” అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్

ఈ ఘటనపై బృందా అక్క మాట్లాడుతూ.. “తొక్కిసలాట వార్తలు వచ్చాక మేము కొంతమందికి కాల్ చేశాం. కానీ స్పందనలేదు. బృందా చనిపోయిందని ఇవాళ ఉదయం తెలిసింది” అని చెప్పింది.

“మేము సాయంత్రం 4 గంటలకు కాల్ చేశాం, కానీ ఆమె ఫోన్ రిసీవ్ చేయలేదు. మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ స్పందన లేదు. రాత్రి 10 గంటల తరువాత ఆమె ఫోన్ ఆఫ్ అయ్యింది. ఇవాళ ఉదయం బృందా భర్త ఆమె ఫొటోను ర్యాలీ నిర్వాహకులకు పంపాడు. అప్పుడు బృందా మరణం గురించి తెలిసింది” అని బృందా అక్క చెప్పారు.

“మీరు సమావేశం ఏర్పాటు చేస్తే, అందుకు తగ్గ పెద్ద స్థలంలో ఏర్పాటు చేయండి. ప్రజలకు భోజనం, నీరు అందించండి. కేవలం పరిహారం ప్రకటిస్తే సమస్యలకు పరిష్కారం చూపినట్లు కాదు. నాకు డబ్బు అవసరం లేదుజ నా చెల్లి కావాలి. వారు ఆమెను తిరిగి ఇస్తారా?” అని నిలదీశారు.