“ఆయన నల్లమల పులి కాదు.. నల్లమల నక్క..” అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్

"రేవంత్ మాట్లాడే గలీజ్ మాటలు ఏ ముఖ్యమంత్రైనా మాట్లాడారా? రేవంత్ రెడ్డి ఓటుకి నోటు దొంగ.. 50 లక్షలతో దొరికిన దొంగ" అని  చెప్పారు.

“ఆయన నల్లమల పులి కాదు.. నల్లమల నక్క..” అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్

KTR

Updated On : September 28, 2025 / 5:52 PM IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న‌ల్ల‌మ‌ల పులి అని చెప్పుకుంటారని, పాల‌మూరుకు చుక్క నీరు రాకుండా పోతుంటే ఆయన పిల్లిలా ఇంట్లో కూర్చోవాలా? వెళ్లి గ‌ర్జించాల్నా? అని బీఆర్ఎస్‌ నేత కేటీఆర్ నిలదీశారు.

అచ్చంపేట బీఆర్ఎస్‌ జనగర్జన సభలో కేటీఆర్ మాట్లాడారు. “ఆయన నల్లమల పులి కాదు.. నల్లమల్ల నక్క.. కొండగల్ ప్రజలు తరిమి కొడతామంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 8 లక్షల పెళ్లిళ్లు అయ్యాయి. ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదు. గ్రామగ్రామానికి, గడప గడపకి బాకీ కార్డ్ పంచాలి. రేవంత్ మాట్లాడే గలీజ్ మాటలు ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడారా? రేవంత్ రెడ్డి ఓటుకి నోటు దొంగ.. 50 లక్షలతో దొరికిన దొంగ” అని  చెప్పారు.

Also Read: ముగ్గురు అమ్మాయిల గోర్లు పీకి, వేళ్లు నరికి, కొట్టి, ఊపిరాడకుండా చేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌..

“అచ్చంపేట్ వాళ్లు మా ఎమ్మెల్యే ఓడి పోతారు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని అనుకున్నారు. యూరియా కోసం లైన్ లో నిలబడే పరిస్థితి వచ్చింది. పాలమూర్-రంగారెడ్డి పూర్తి చేస్తే కేసీఆర్ కి పేరు వస్తుందని పూర్తి చేయడం లేదు. రేవంత్‌ రెడ్డి తెల్లారితే కేసీఆర్ జపం చేస్తున్నారు.

“మీకు తోడుగా ఎవరు ఉన్నా, లేకపోయినా బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం మీకు అండగా ఉంటుంది. పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్స్ చేస్తే సంవత్సరం అయినా మంత్రి, ఈడీ నోరు విప్పడం లేదు. తెలంగాణలో ఉన్నది జాయింట్ వెంచర్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి పొద్దున ఒకలా, రాత్రి ఒకలా మాట్లాడుతారు. అచ్చంపేట్ నుంచే జైత్ర యాత్ర ప్రారంభం. కాంగ్రెస్ వాళ్లు ఓట్లకి వస్తే తగిన విధంగా బుద్ధి చెప్పాలి.

ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచవద్దని గతంలోనే పోరాటం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తు పెంచి కిందికి నీళ్లు రాకుండా చేస్తుంది. నల్లమల్ల పులి బిడ్డకి అడ్డుకునే దమ్ము లేదా? గులాబి దండు వెళ్లి అడ్డుకోవాలా?” అని కేటీఆర్ అన్నారు.