వధువును పట్టుకులాగిన వరుడి ఫ్రెండ్స్.. పెళ్లి క్యాన్సిల్

గౌరవం లేని వాడితో పెళ్లి చేసుకోలేనంటూ ఆ పెళ్లి కూతురు పెళ్లి క్యాన్సిల్ చేసేసుకుంది. ముందుగా ఈ నిర్ణయం తీసుకున్న పెళ్లికూతురి తండ్రి మాటతో పెళ్లి వేడుక సైలెంట్ అయిపోయింది. డ్యాన్స్ చేయాలంటూ వరుడి స్నేహితులు ఆమెను పట్టుకులాగడం ఇంతటి ఘటనకు దారి తీసింది.

బరేలీ జిల్లాలోని ఓ గ్రామంలో వరుడికి.. కన్నౌజ్ జిల్లాలో వధువుతో సంబంధం కుదిరింది. వారిద్దరూ గ్రాడ్యుయేట్స్ కూడా. ఇరు బంధువర్గాల సమక్షంలో పెళ్లి కూడా కుదిర్చారు. శుక్రవారం బరేలీకి వచ్చిన పెళ్లికూతురు కుటుంబ సభ్యులు, బంధువులు వేడుకల్లో మునిగిపోయారు. అంతా పర్ఫెక్ట్ గానే అనిపిస్తున్న సమయంలో వరుడు స్నేహితులు డ్యాన్స్ వేస్తూ పెళ్లికూతుర్ని పట్టుకులాగారు.

తమతో పాటు డ్యాన్స్ చేయమని లాగినప్పటికీ వాదన మొదలైంది. ఇరు వర్గాల మధ్య వాతావరణం ఘర్షణకు దిగేలా చేసింది. అంతే పెళ్లి క్యాన్సిల్ చేసేసుకుని పెళ్లికూతురు ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. అంతేకాకుండా పెళ్లికొడుకు కుటుంబంపై వరకట్నం కేసు కూడా బుక్ చేశారు. పెళ్లికొడుకు ఫ్యామిలీ కట్నం కూడా తిరిగి ఇచ్చేందుకు రెడీ అయిపోయింది.

ఎటువంటి వరకట్నం కేసులు నమోదు కాలేదు. ఇరు వర్గాల వారు సెటిల్మెంట్ కు రెడీ అయ్యారని పోలీస్ ఆఫీసర్ అంటున్నారు. ఆదివారం ఆ కుటుంబం పెళ్లి కూతురు కుటుంబాన్ని కన్విన్స్ చేసి మళ్లీ పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ, తనతో తప్పుడుగా ప్రవర్తించిన వారితో పెళ్లికి యువతి ససేమేరా కుదరదని చెప్పేసింది.