DRDO Drone: పొలాల్లో కుప్పకూలిన డీఆర్‌డీవో డ్రోన్.. భయాందోళనకు గురైన స్థానికులు

పొలాల్లో డ్రోన్ కూలిపోవటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దం రావడంతో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకున్నారు.

DRDO Drone

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన డ్రోన్ ఆదివారం ఉదయం కుప్పకూలింది. చిత్రదుర్గ జిల్లా హరియూర్ తాలూకాలోని వడ్డికెరె గ్రామంలోని పొలాల్లో డ్రోన్ కూలిపోయింది. అయితే, డ్రోన్ కూలిన సమయంలో పొలంలో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డ్రోన్‌ను ఆదివారం ఉదయం డీఆర్‌డీవో పరీక్షిస్తుండగా కూలిపోయినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. డ్రోన్ కూలిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు.

Pak drone : అమృత్‌సర్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ స్వాధీనం

పొలాల్లో డ్రోన్ కూలిపోవటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దం రావడంతో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం డ్రోన్ కూలిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. డ్రోన్ కూలడంతో లోపలఉన్న దాని పరికరాలు పొలంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. డ్రోన్ కూలిన సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు పేర్కొన్నారు.