Rajasthan : ఒక్క కచోరీ రైలును ఆపేసింది..

మెల్లిగా ట్రైన్ వస్తోంది. అక్కడనే సడెన్ గా ఆగిపోవడం.. చేతిలో ఉన్న కవర్ ను రైలులో ఉన్న వ్యక్తికి ఇవ్వడం కనిపించింది. రూల్స్ ప్రకారం... ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర రైలు ఆపకూడదనే నిబంధన

Rajasthan : ఒక్క కచోరీ రైలును ఆపేసింది..

Kachori

Updated On : February 23, 2022 / 5:45 PM IST

Kachori In Rajasthan Alwar : ఈ మధ్య కాలంలో రైళ్లను పలు ప్రాంతాల్లో ఆపుతున్నారు డ్రైవర్లు. మొన్న పెరుగు కోసం ఓ డ్రైవర్ రైలును ఆపగా.. ఇప్పుడు కచోరీ కోసం ఆపాడు. రైల్వే క్రాసింగ్ దగ్గరనే ఆపి.. ఓ వ్యక్తి ఇచ్చిన కచోరిని తీసుకున్నాడు. రైల్వే క్రాసింగ్ దగ్గర వారిలో కొంతమంది ఇదంతా వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అళ్వార్ లో ఓ రైలు క్రాసింగ్ దగ్గర గేటు పడడంతో వాహనదారులు అటూ ఇటూ వైపు నిల్చొన్నారు. అంతలో ఓ వ్యక్తి ప్లాస్టిక్ కవర్ ను చేతులో పట్టుకుని పట్టాల వైపుకు వచ్చాడు. అక్కడ నిల్చొన్నాడు. అక్కడున్న వాహనదారులకు ఎందుకు నిల్చొన్నాడో అర్థం కాలేదు.

Read More : Chandigarh : అంధకారంలో చండీగఢ్.. కరెంటు కట్‌‌తో పరిస్థితి అస్తవ్యస్థం

అంతలో మెల్లిగా ట్రైన్ వస్తోంది. అక్కడనే సడెన్ గా ఆగిపోవడం.. చేతిలో ఉన్న కవర్ ను రైలులో ఉన్న వ్యక్తికి ఇవ్వడం కనిపించింది. రూల్స్ ప్రకారం… ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర రైలు ఆపకూడదనే నిబంధన ఉంది. కవర్ లో కచోరీలున్నాయని, దీనిని తీసుకోవడానికే రైలును ఆపినట్లు తేలింది. ఇలా కొన్ని క్షణాల పాటు ఆగి ఉన్న రైలును చూసి జనాలు నోరెళ్లబెట్టారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవడంతో జైపూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు లోకో పైలట్లు, ఇద్దరు గేట్ మెన్, మరొకరిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.