Chandigarh : అంధకారంలో చండీగఢ్.. కరెంటు కట్‌‌తో పరిస్థితి అస్తవ్యస్థం

అనేక గ్రామాల్లో వేలాది ఇళ్లకు కరెంటు కట్ అయ్యింది. 36 గంటలు గడిచినా ఇంకా కరెంటును పునరుద్ధరించలేదని తెలుస్తోంది. పవర్ కట్ తో ఆన్ లైన్ క్లాసులు జరగలేదు. కోచింగ్ ఇనిస్టిట్యూట్ లు ...

Chandigarh : అంధకారంలో చండీగఢ్.. కరెంటు కట్‌‌తో పరిస్థితి అస్తవ్యస్థం

Current

72 Hour ణong Strike : చండీగఢ్ అంధకారంలోకి వెళ్లిపోయింది. కేంద్ర పాలిత ప్రాంతమైన ఇక్కడ దాదాపు చాలా ప్రాంతాల్లో కరెంటు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 36 గంటలుగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. కరెంట్ కట్ అవడంతో దీనిపై ఆధారపడిన రంగాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. నీటి సరఫరా నిలిచిపోయింది. లైట్లు వెలగకపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యవస్థంగా మారిపోయింది. ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలను కూడా వాయిదా వేసే పరిస్థతి నెలకొంది. దీనికంతటికీ కారణం విద్యుత్ విభాగం సిబ్బంది సమ్మకు దిగడమే. ఎలక్ట్రిసిటీ విభాగాన్ని ప్రైవేటు పరం చేయాలని చండీగఢ్ ప్రభుత్వం నిర్ణయించడాన్ని విద్యుత్ విభాగ సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో మూడు రోజుల పాటు సమ్మె చేపట్టాలని పిలుపునిచ్చారు.

Read More : Taj Mahal: తాజ్ మహల్‌ని ఉచితంగా చూడొచ్చు.. నిజమైన సమాధిని చూసే అవకాశం!

వెంటనే రంగంలోకి దిగిన విద్యుత్ అధికారులు వారితో చర్చలు చేపట్టారు. కానీ.. చర్చలు జరిగినా.. సఫలం కాలేదు. సోమవారం అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి వెళ్లిపోయారు. విధులకు హాజరు కాకపోవడంతో కరెంటు నిలిచిపోయింది. అనేక గ్రామాల్లో వేలాది ఇళ్లకు కరెంటు కట్ అయ్యింది. 36 గంటలు గడిచినా ఇంకా కరెంటును పునరుద్ధరించలేదని తెలుస్తోంది. పవర్ కట్ తో ఆన్ లైన్ క్లాసులు జరగలేదు. కోచింగ్ ఇనిస్టిట్యూట్ లు మూతపడ్డాయి. కరెంటు లేకపోవడంతో ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఫోన్ లలో ఛార్జింగ్ లేకపోవడంతో ఇతరులతో మాట్లాడేందుకు ఇబ్బందులు పడ్డారు. కరెంటు ఉన్న ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. పక్కనే మోహలీ, జిరాక్ పూర్, పంచకుల ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. ఈ విషయాన్ని చండీఘడ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సమ్మె చేపట్టిన విద్యుత్ విభాగ సిబ్బందిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఆరు నెలల పాటు సమ్మెలు చేయకుండా నిషేధం విధించింది. దీనిని విద్యుత్ విభాగ సిబ్బంది పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. చాలా ప్రదేశాల్లో బుధవారం కూడా కరెంటు సరఫరా కాలేదని తెలుస్తోంది.

Read More : Nawab Malik : బీజేపీతో పొత్తు వదులుకుంటేనే నితీష్ కు రాష్ట్రపతి అభ్యర్థిత్వం : నవాబ్‌ మాలిక్‌

పంజాబ్, హర్యానా హైకోర్టు సమోటోగా దీనిని స్వీకరించింది. పరిస్థితిని కోర్టు పరిశీలిస్తోంది. జస్టిస్ అజయ్ తివారీ, జస్టిస్ పంకజ్ జైన్ మాట్లాడుతూ..న్యాయపరంగా దీనిని పరిష్కరించాల్సి ఉందని, నగర వాసులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగిందన్నారు. సమ్మె చేస్తున్న ఉద్యోగుల చర్యల వల్లే.. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్ అనిల్ మెహతా కోర్టుకు తెలిపారు. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన అధికారులను తీసుకరావాలని అభ్యర్థన చేయడం జరిగిందన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో సాధారణ ప్రజలతో పాటు.. వెంటిలెటర్లపై ఉన్న రోగులు, ఆసుపత్రులపై ప్రభావం చూపెడుతోందని, దీనిని విస్మరించలేమని కోర్టు పేర్కొంది. కోర్టుల్లో వర్చువల్ హియరింగ్ కు కూడా అంతరాయం ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. చండీగఢ్ చీఫ్ ఇంజినీర్ ను బుధవారం హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. సంక్షోభాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని సూచించింది.