Vijay-Rashmika Marriage: ఫిబ్రవరిలోనే విజయ్-రష్మిక పెళ్లి.. అతిధులకు ప్రత్యేక జ్ఞాపకంగా.. జీవితకాలం గుర్తుండిపోయేలా..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్ చేసుకున్న (Vijay-Rashmika Marriage)విషయం తెలిసిందే. ఎలాంటి హంగామా లేకుండా చాలా గోప్యాంగా ఈ నిశ్చితార్ధ వేడుక జరిగింది.

Vijay-Rashmika Marriage: ఫిబ్రవరిలోనే విజయ్-రష్మిక పెళ్లి.. అతిధులకు ప్రత్యేక జ్ఞాపకంగా.. జీవితకాలం గుర్తుండిపోయేలా..

Vijay Deverakonda and Rashmika Mandanna to get married in February

Updated On : November 6, 2025 / 6:50 PM IST

Vijay-Rashmika Marriage: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి హంగామా లేకుండా చాలా గోప్యాంగా ఈ నిశ్చితార్ధ వేడుక జరిగింది. కేవలం ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఈ న్యూస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాకయ్యింది. సోషల్ మీడియా మొత్తం ఈ న్యూస్ తోనే షేక్ అయ్యింది. కానీ, విజయ్ నుంచి గానీ,(Vijay-Rashmika Marriage) రష్మిక నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగని, ఎవరు ఖండించలేదు కూడా. దాంతో, ఈ వార్తలు నిజమే అంటూ ఫిక్స్ అయిపోయారు అంతా.

Tamannaah Bhatia: బ్లాక్ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్స్.. తమన్నా హాట్ ఫొటోస్

అయితే, ఈ ఎంగేజ్మెంట్ తంతు ముగిసినప్పటినుంచి పెళ్లి గురించి చర్చ నడుస్తూనే ఉంది. వీరి పెళ్లి వేడుక ఎప్పుడు ఉంటుంది అని తెలుసుకోవడానికి జనాలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అయితే, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా సన్నిహితుల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు వీరి పెళ్లి ఫిబ్రవరిలోనే ఉండనుందట. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం తరువాత వారం రోజులకి ఈ పెళ్లి వేడుక ఉండనుందని సమాచారం. ప్రస్తుతం విజయ్, రష్మిక వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, పెళ్లి విషయంలో మాత్రం అన్నీ దగ్గరుండి చూసుకోనున్నారట.

ఇద్దరి జీవితాల్లో ఒక మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా ఈ పెళ్లి వేడ్క జరగాలని ఫిక్స్ అయ్యారట. ఆలాగే, పెళ్లికి వచ్చే అతిధులకు సైతం ఈ పెళ్లి వేడుకగా ప్రత్యేకంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారట. వాళ్ళు కూడా తమ జీవితంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారట. ఇక పెళ్లి కూడా.. డెస్టినేషన్ వెడ్డింగ్ కాకుండా హైదరాబాద్ లోనే సంప్రదాయ బద్దంగా జరిగేలా చూస్తున్నారట. త్వరలోనే ఈ పెళ్ళి గురించి ఇరు కుంటుంబాల నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.