Drunken Head Master
Drunk Headmaster: గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ చేసిన అకృత్యం ఇది. ఫుల్లుగా మద్యం సేవించి బాలికను బలవంతం చేయడమేకాకుండా వీడియో కూడా రికార్డు చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఆదివారం డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఈఓ) ఎస్కే మిశ్రాపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం స్కూల్ కు తాగి వచ్చిన రాజేశ్ ముంద్రా అనే హెడ్ మాస్టర్.. బాలికలను డ్యాన్స్ చేయాలంటూ బలవంత పెట్టాడు. అంతేకాకుండా గదిలోపల ఉంచేసి డోర్ లాక్ చేసేశాడు.
బయటకు వచ్చిన తర్వాత విషయాన్ని పేరెంట్లకు పూస గుచ్చినట్లుగా వివరించడంతో బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు, ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కు తెలిసింది. వెంటనే అతణ్ని విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు.
………………………………… : 45 వైన్ బాటిల్స్ దొంగిలించిన జంట