Refined couple : 45 వైన్ బాటిల్స్ దొంగిలించిన జంట | Hotel guests steal 45 rare wine bottles from restaurant

Refined couple : 45 వైన్ బాటిల్స్ దొంగిలించిన జంట

ఓ జంట మాత్రం రెస్టారెంట్ కు వెళ్లి..కోట్ల విలువైన వైన్ బాటిల్స్ చోరీ చేశారంట. అత్యంత అరుదుగా ఈ వైన్ బాటిల్స్ లభిస్తాయని చెబుతున్నారు.

Refined couple : 45 వైన్ బాటిల్స్ దొంగిలించిన జంట

Hotel Guests Steal 45 Rare Wine Bottles : పురాతనమైన వైన్ అంటే మందుబాబులకు భలే ఇష్టం. వాటిని దక్కించుకోవడానికి ఎంతైనా డబ్బు చెల్లిస్తుంటారు. కానీ..ఓ జంట మాత్రం రెస్టారెంట్ కు వెళ్లి..కోట్ల విలువైన వైన్ బాటిల్స్ చోరీ చేశారంట. అత్యంత అరుదుగా ఈ వైన్ బాటిల్స్ లభిస్తాయని చెబుతున్నారు. 45 బాటిల్స్ చోరీ చేశారని, అందులో దాదాపు 215 సంవత్సరాల కిందట వైన్ బాటిల్స్ కూడా ఉన్నాయని.. వీటి ఖరీదు దాదాపు 4 లక్షల డాలర్లు (రూ. 3 కోట్లు) అని రెస్టారెంట్ యజమానులు వెల్లడించారని సమాచారం. ఈ ఘటన స్పెయిన్ లో చోటు చేసుకుంది. దీనిపై హోటల్ యజమానుల్లో ఒకరనై జోస్ పాల్ వివరాలు వెల్లడించారు.

Read More : Badvel Bypoll : వైసీపీ రిగ్గింగ్‌‌కు పాల్పడింది – బీజేపీ

సౌత్ వెస్టర్ స్పెయిన్ లోని ఓ స్పానిష్ రెస్టారెంట్ లో ఓ జంట ప్రవేశించింది. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్న ఆ జంట…హోటల్ లో భోజనం చేస్తున్నారని తెలిపారు. మరికాస్త భోజనం అడగడంతో తమ సిబ్బంది..ఆహారం వడ్డించడంలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. ఈ సమయంలో..జంటలో ఒకరు హోటల్ సెల్లార్ కు వెళ్లారన్నారు. అక్కడ దాదాపు 40 వేలకు పైన అత్యంత ఖరీదుగా లభించే వైన్ బాటిల్స్ ఉన్నాయన్నారు. వారు దొంగిలించిన బాటిల్స్ లను మార్కెట్ లో మార్చలేరని ఎందుకంటే…వాటన్నింటికీ బీమా ఉందన్నారు. సమాచారం అందుకున్న కాసెరెస్ లోని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

      ×