Badvel Bypoll : వైసీపీ రిగ్గింగ్‌‌కు పాల్పడింది – బీజేపీ

బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆ పార్టీకి చెందిన నేతలు మండిపడుతున్నారు.

Badvel Bypoll : వైసీపీ రిగ్గింగ్‌‌కు పాల్పడింది – బీజేపీ

Ap Bjp

Badvel Bypoll 2021 : బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆ పార్టీకి చెందిన నేతలు మండిపడుతున్నారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి పూర్తిగా సహకరించిందని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లను అద్దెకు తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని, వైసీపీ ఆక్రమాలను వీడియోలు, ఫొటోల రూపంలో మీడియాకు ఇవ్వడం జరిగిందన్నారు. హుజూరాబాద్ ఉప పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే.

Read More : Ajay Misra : కేంద్రమంత్రి మిశ్రా కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి

దీనిపై బీజేపీ ఎంపీ నరసింహరావు, ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ దేవదర్ మీడియాతో మాట్లాడారు. 28 పోలింగ్ బూతులలో రీపోలింగ్ జరిపిన తర్వాతనే ఎన్నికల ఓట్ల లెక్కింపు జరపాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని, కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో తాము కోర్టులను ఆశ్రయించే ఆలోచన చేస్తామన్నారు. 50 వేల నుండి 60 వేల దొంగ ఓట్లు వేయించుకున్నారని, ఎన్నికల అధికారులు, ఎన్నికల పరిశీలకులు కూడా ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు.

Read More : CM Stalin : అసెంబ్లీలో భోజనశాల క్లోజ్, ఎమ్మెల్యేలు టిఫిన్ బాక్స్ తెచ్చుకోవాల్సిందే!

ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా వైసీపీ నేతలు ప్రవర్తించారంటూ దుయ్యబట్టారు. గోపవరం , అట్లూరు, బద్వేల్ రూరల్, బి కోడూరు మండలాల్లోని 28 పోలింగ్ బూతులలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి కాబట్టి అక్కడ రీపోలింగ్ జరపాలని ఈసీని కోరడం జరిగిందన్నారు. ఈ వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు, స్థానిక అధికారులు వైసీపీ ఏజెంట్లతో కుమ్మక్కయ్యారని..అంతేగాకుండా.. బీజేపీ పోలింగ్ ఏజెంట్లను భయబ్రాంతులకు గురిచేశారని తెలిపారు.

Read More : Pawan Kalyan: వైసీపీకి 48 గంటలు గడువిస్తున్నా.. స్టీల్ ప్లాంట్‌పై స్పందించకుంటే..!

బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ కొత్త సాంప్రదాయానికి తెరతీసిందన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్‌ దేవదర్ తెలిపారు. ఓటింగ్ సంధర్భంగా ఫొటో ఐడీ లేని పోలింగ్ స్లిప్పులు పంచారని, ఏపిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి లోక్ సభకు జరిగిన ఉపఎన్నిక తరహా అక్రమాలకు బద్వేల్ ఉప ఎన్నికలో కూడా కొనసాగించారని విమర్శించారు.