Dry Day Declared : మద్యం బాబులకు షాక్..న్యూ ఇయర్ రోజున లిక్కర్ షాపులు క్లోజ్

ఓ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం మందుబాబులకు షాక్ కు గురి చేసింది. జనవరి 01వ తేదీన మద్యం షాపులు బంద్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది.

Dry Day Declared : మద్యం బాబులకు షాక్..న్యూ ఇయర్ రోజున లిక్కర్ షాపులు క్లోజ్

Closed

Updated On : December 24, 2021 / 1:06 PM IST

Liquor Shops Closed : కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. గుర్తుండి పోయేలా వేడుకలు నిర్వహించుకోవాలని కొంతమంది ప్లాన్స్ చేసుకుంటున్నారు. సాధారణంగా…పార్టీ అంటేనే లిక్కర్ ఉండాల్సిందేనంటారు కొంతమంది మందుబాబులు. అదీ న్యూ ఇయర్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు. డిసెంబర్ 31వ తేదీ..జనవరి 01వ తేదీ..ఈ రెండు రోజుల్లో మద్యం ఏరులై పారుతుంది. కోట్ల విలువైన లిక్కర్ ను కొనుగోలు చేస్తారు. దీంతో రాష్ట్రాల ఆబ్కారీ శాఖల ఖజానా గలగలలాడుతుంది. అయితే..ప్రస్తుతం ఇంకా కరోనా టైం నడుస్తోంది. కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ దడదడలాడిస్తోంది. మళ్లీ మునుపటి రోజులు వస్తాయా ? అంటూ మందుబాబులు తీవ్ర ఆందోళనలో ఉన్నారంట.

Read More : Maharashtra ‘Shakti Bill’ : ‘శక్తి బిల్లు’కు మహారాష్ట్ర ఆమోదం..మహిళలపై నేరానికి పాల్పడితే ఉరిశిక్ష..

అనుకున్నట్లే కొన్ని రాష్ట్రాలు పలు నిబంధనలు, ఆంక్షలు అమలు చేస్తున్నాయి. తాజాగా..ఓ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం మందుబాబులకు షాక్ కు గురి చేసింది. జనవరి 01వ తేదీన మద్యం షాపులు బంద్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాత ఏడాది లాస్ట్ డే, కొత్త సంవత్సరం మొదటి రోజు…మద్యం సేల్స్ ఫుల్ గా ఉంటాయనే సంగతి తెలిసిందే. మేఘాలయలో మాత్రం 2021, డిసెంబర్ 24, 25వ తేదీల్లో మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా..2022, జనవరి 01న కూడా షాపులు క్లోజ్ చేయాలని సూచించింది. అయితే..ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..రాష్ట్రం మొత్తం కాకుండా…కేవలం ఈస్ట్ ఖాసి హిల్స్ జిల్లాలో మాత్రం ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసింది.