Maharashtra ‘Shakti Bill’ : ‘శక్తి బిల్లు’కు మహారాష్ట్ర ఆమోదం..మహిళలపై నేరానికి పాల్పడితే ఉరిశిక్ష..

‘శక్తి బిల్లు’కు మహారాష్ట్ర ఆమోదం పలికింది.ఇకపై మహిళలు,చిన్నారులపై నేరానికి పాల్పడాలంటే భయపడాల్సిందే. ఈ బిల్లు ప్రకారం.. ఉరిశిక్ష కూడా పడొచ్చు..

Maharashtra ‘Shakti Bill’ : ‘శక్తి బిల్లు’కు మహారాష్ట్ర ఆమోదం..మహిళలపై నేరానికి పాల్పడితే ఉరిశిక్ష..

Maharashra ‘shakti Bill’

Maharashra Govt ‘Shakti Bill’ : నెలల చిన్నారుల నుంచి వృద్ధుల వరకు మహిళలపై జరిగే దారుణాలు..అఘాయిత్యాలు, హింసలు అత్యాచారాలు అన్నీ ఇన్నీ కావు. చట్టాలు ఉన్నా ఆడపుట్టుకలపై దారుణాలు మాత్రం ఆగటంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడి సహించేది లేదని..అటువంటివారిని అత్యంత కఠినంగా శిక్షించేలా మహారాష్ట్ర అసెంబ్లీ గురువారం (డిసెంబర్ 23,2021)కీలక బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు హత్యలు,అత్యాచారాలు, యాసిడ్ దాడులు వంటి నేరాలకు పాల్పడితే.. శిక్షల పరిమాణాన్ని పెంచాలని ప్రతిపాదిస్తుంది. అంతేకాదు భారీ జరిమానాలు..నేరాల కేసుల్ని త్వరగా విచారణ జరిపి శిక్షవిధించేలా ఈ బిల్లు రూపొందించిబడింది. నేర తీవ్రతను బట్టి ఉరిశిక్ష కూడా విధించేలా ఉంటుంది ఈ బిల్లు.

Read more : Shocking : డబ్బుల కోసం..8 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న యువకుడు

కొన్ని కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించటానికి కూడా ఈ బిల్లు వీలు కల్పించనుంది. ‘శక్తి క్రిమినల్‌ చట్టాల (మహారాష్ట్ర సవరణ) బిల్లు’గా దాన్ని పిలుస్తున్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణ శరవేగంగా పూర్తయ్యేందుకు ఇది దోహదపడుతుంది. త్వరలోనే దానికి శాసనమండలి ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.

ఈ ‘శక్తి బిల్లు’ నిబంధనల ప్రకారం.. మహిళలు, చిన్నారులపై కొన్నిరకాల నేరాలకు పాల్పడేవారికి ఏకంగా మరణశిక్ష విధించొచ్చు. ఈ కేసుల్లో దర్యాప్తు.. ఫిర్యాదు అందిన 30 రోజుల్లోపు పూర్తవ్వాల్సి ఉంటుంది. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా అధికారులు కోరే డేటాను సామాజిక మాధ్యమాలు, అంతర్జాల సర్వీసు ప్రొవైడర్లు 7 రోజుల్లోపు తప్పనిసరిగా అందించాలని తాజా బిల్లు స్పష్టం చేస్తోంది.

Read more : Online marriage : ఆన్‌లైన్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేరళ హైకోర్టు..ఎందుకంటే..

ఈ బిల్లు అమలులోకి వస్తే ఇక నేరాల కేసుల్ని అత్యంత త్వరగా విచారణ జరిపి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయని ఆశిద్దాం. కాగా భారత్ లో నేరాల సంఖ్యను బట్టి చూస్తే ఆ కేసు విచారణ..దర్యాప్తు ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించటం..వంటి పలు కీలక విషయాలు అత్యంత ఆలస్యం అవుతోంది. దీంతో నేరస్థులకు శిక్ష పడటం చాలా తక్కువగా జరుగుతోంది. ఈక్రమంలో నేరస్థులు నేరాలనుంచి తప్పించుకోవటానికి పలు యత్నాలు చేసి తప్పించుకోవటం కూడా జరిగిన కేసులు చాలానే ఉన్నాయి.